ETV Bharat / state

ఇలా జరుగుతుందని ఊహించక.. సీజ్ చేసిన టపాసులను పోలీస్ స్టేషన్​లో ఉంచారు.. చివరికి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పోలీస్​ స్టేషన్​లో అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. ఇలా జరుగుతుందని సిబ్బంది ఊహించి ఉండరు. పోలీసులు పలు కేసుల్లో సీజ్ చేసిన టపాసులను పోలీస్​ స్టేషన్​లో ఉంచారు. సీజ్ చేసిన వీటి విలువ మూడు లక్షల వరకు ఉంటుందని అంచనా. కానీ చివరికి వారు ఊహించని సంఘటన జరిగింది.. ఏమైందంటే..

Saluru Police Station
సాలూరు పోలీస్​ స్టేషన్​
author img

By

Published : Sep 10, 2022, 8:21 PM IST

Crackers Blast In Police Station: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్​లో టపాసులు పేలి అగ్ని ప్రమాదం జరిగింది. పలు కేసుల్లో సీజ్ చేసిన టపాసులను పోలీస్ స్టేషన్​లో ఉంచారు. సీజ్ చేసి పోలీస్ స్టేషన్​లో ఉంచిన క్రాకర్స్ పేలి ప్రమాదం జరిగింది. వీటి విలువ దాదాపు 3 లక్షల వరకు ఉంటుందని అంచనా. రాపిడి సంభవించి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని సిబ్బంది భావిస్తున్నారు. సీజ్‌ చేసిన పేలుడు సామగ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఉంచటం పై విమర్శలు వస్తున్నాయి. ఒక్కసారిగా పేలుడు శబ్దం రావటంతో చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.