ETV Bharat / state

AP JAC Amaravati: ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి మినహాయించాలి - ap news

AP JAC Amaravati: ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను, సస్పెన్షన్లను ఎత్తిచేయాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి మినహాయించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Bopparaju Venkateswarlu
బొప్పరాజు వెంకటేశ్వర్లు
author img

By

Published : May 8, 2023, 5:23 PM IST

AP JAC Amaravati: ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి మినహాయించాలి

AP JAC Amaravati president Bopparaju Venkateswarlu: ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడం సరైనది కాదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం కలెక్టరేట్ వద్ద ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జరిగిన మూడో విడత నిరసన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులు, అక్రమ సస్పెన్షన్లు, వేధింపులు నిలిపివేయాలంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా స్పందన కార్యక్రమాల్లో ద్వారా తెలియజేశామని బొప్పరాజు తెలియజేశారు. కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశామని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఇప్పటికీ.. రెండు దశల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మూడో విడత కార్యక్రమంలో ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలోని కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.

బోధనేతర పనులను అప్పగించి తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం పుస్తకాలు పంపిణీ చేయకుండా ఆ నెపాన్ని అధికారులపై వేసి.. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ పార్వతిపురం మన్యం జిల్లాలో డీఈవో, ఎంఈఓ, జీసీడీఓ, ఎస్వోలను సస్పెండ్ చేయడం సరైనది కాదన్నారు. డీఈవో, జీసీడీవోల సస్పెన్షన్ రద్దు చేసినట్లే మిగతా ఇద్దరిని విధుల్లోకి తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులపై ఉన్న సస్పెన్షన్స్ అన్నింటినీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, డీఏ, పీఆర్సీ అరియర్స్​ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని అన్నారు.

కర్నూలులో ప్రారంభమైన మూడవ దశ ఉద్యమం: ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి మినహాయించి.. వారి సమస్యలను పరిష్కరించాలని ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో మూడవ దశ ఉద్యమం కర్నూలులో ప్రారంభమైంది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎన్. సృజనకు ఏపీజేఏసీ అమరావతి నాయకులు వినతిపత్రం అందించారు.

వైఎస్సార్సీపీ హయంలో ఉపాధ్యాయులు కన్నీరు పెట్టుకునే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజాన్ని ఉన్నత స్థానంలో పెట్టే గురువులను రక్షించాలని.. ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు భోదనేతర పనులను మినహాయించి వారిని కేవలం బోధనకే పరిమితం చేయాలని వారు కోరారు. చిన్నచిన్న తప్పిదాలకు సస్పెండ్లు చేసి షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.