ETV Bharat / state

మటన్​ ఇవ్వలేదని పింఛన్​​ నిలిపివేత.. పల్నాడు జిల్లాలో వాలంటీర్​ నిర్వాకం

Volunteer Stopped Giving Pension : అందరికీ సకాలంలో పింఛన్లు సరఫరా చేయాల్సిన వాలంటీర్​ తన వక్రబుద్దిని చూపించాడు. పింఛన్​ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశాడు. అందరికీ పింఛన్లు ఇస్తూ తనకు మాత్రమే ఇవ్వడం లేదని బాధితుడు వాపోయాడు. ఇంతకు పింఛన్​ ఎందుకు ఇవ్వలేదో తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Volunteer Stopped Giving Pension
మటన్​ ఇవ్వలేదని ఫింఛన్​ ఆపిన వాలంటీర్​
author img

By

Published : Jan 3, 2023, 7:34 PM IST

Volunteer Stopped Pension : పల్నాడు జిల్లాలోని నాదెండ్ల మండలం ఎండుగుపాలెంలో దావల బుచ్చయ్య అనే వాలంటీర్ ఓ లబ్ధిదారుడి పట్ల వేధింపులకు పాల్పడ్డాడు. అతనిపై ఆగ్రహాన్ని పింఛన్​ ఇవ్వకుండా.. తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. దావల బాబు అనే డప్పు కళాకారునికి పింఛన్​ ఇవ్వకుండా ఆపేసి.. లబ్దిదారుడిపై ఉన్న ఉక్రోషాన్ని ప్రదర్శించాడు. మటన్​ అప్పుగా ఇవ్వాలని లబ్ధిదారుడిని ఇవ్వాలని వాలంటీర్​ కోరగా.. బాబు కుదరదన్నాడు. అంతే ఇది మనసులో పెట్టుకున్న వాలంటీర్​.. పింఛన్​ పంపిణీ చేసే సమయంలో బాబుకు ఇవ్వకుండా ఆపేశాడు. మటన్​ అప్పుగా ఇవ్వలేదనే కారణంతో పింఛను నిలిపివేశాడని బాధితుడు వాపోయాడు. పింఛన్​ ఇవ్వకుండా వాలంటీర్​ తిప్పుకుంటున్నాడని బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.