Telugu Desam activist Mirchi Crop Destroyed in Palnadu district : పల్నాడు జిల్లాలో తెలుగుదేశం (TDP ) కార్యకర్త వెంకటేశ్వర్లు మిర్చి తోటను దుండగులు ధ్వంసం చేశారు. వినుకొండ మండలం నడిగడ్డకు చెందిన వెంకటేశ్వర్లు మూడెకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. ఈ ఉదయం పొలానికి వెళ్లే సరికి అందులో అర ఎకరం విస్తీర్ణంలో మొక్కలు పీకి వేశారు. గ్లౌజులు వేసుకుని మరీ మొక్కలు పీకివేసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ గ్లౌజుల్ని కూడా పొలంలో పడేశారు. మద్యం సీసాలు కూడా అక్కడే వేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడింది ఎవరనేది తెలియకుండా దుండగులు జాగ్రత్త పడ్డారు.
రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. మహిళ అని చూడకుండా..
TDP V/S YSRCP : రైతు ఎక్కల వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా తిరుగుతుంటారు. తనపై కక్షగట్టి వైసీపీ ( YSRCP Leaders) నేతలు ఈ చర్యకు పాల్పడ్డారని వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే మిర్చి కోతలు ప్రారంభించాల్సి ఉన్న తరుణంలో పంటను నాశనం చేసి వెళ్లటంపై బాధితురాలు కన్నీరు పెట్టుకున్నాారు. పుట్టింటి వాళ్లు పసుపు, కుంకుమ కింద వచ్చిన పొలంలో ఇలాంటి విధ్వంసానికి పాల్పడటంపై ఆవేదన వ్యక్తం చేశారు.
పలాసలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. టీడీపీ కార్యకర్తపై దాడి
Lady Farmer Cryed For Crop : మిరప మొక్కలను (Mirchi Crop) పీకేసిన దుండగులు పొలంలో వైసీపీ జెండాలు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఇటువంటి పనులు ఇంతకుముందెన్నడూ చూసింది లేదని ఈ ఘటన చూసిన స్థానికులు సానుభూతి వ్యక్తం చేశారు. తెలుగు దేశం తరుపున అభిమానంగా పనిచేస్తున్నాడనే కారణంతో వారిని వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నారని బాధిత కుంటుంబ సభ్యులు వాపోయారు.
మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్న బండారు
Mirchi Farmer Problems Due to Political Issue : పంట ఉన్నటువంటి భూమి గురించి ఎటువంటి వివాదాలు లేవని బాధితులు పేర్కొన్నారు. తమపై కక్ష కట్టి వారి కుటుంబాన్ని పలు సమస్యల్లో ఇరికిస్తున్నారని వారు వాపోయారు. ఇంట్లో తన భర్త, కొడుకు లేని సమయం చూసి ఈ దారుణానికి ఒడిగట్టారని మహిళా రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ దృశ్యం చూసిన స్థానికులు నిస్సహాయంగా ఉండిపోయారు. పంట చేతికందే సమయంలో వారి శ్రమను ఇలా నాశనం చెయ్యడం పట్ల మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
మాచర్లలో ఉద్రిక్తత.. తెదేపా కార్యాలయం, వాహనాలకు నిప్పుపెట్టిన వైసీపీ శ్రేణులు
నెల్లూరు మేయర్‌పై దాడి అమానుషం..ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం..