ycp leader Ganji Chiranjeevi: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవికి ఊహించని షాక్ తగిలింది. పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన పద్మశాలీల వనభోజనాల్లో పాల్గొన్న గంజి చిరంజీవి అక్కడ రాజకీయ ప్రసంగం ప్రారంభించారు. నారా లోకేశ్‍పై, తెలుగుదేశంపై విమర్శలు గుప్పించారు. దీనిపై స్థానిక పద్మశాలి నాయకుడు, తెదేపా మద్దతుదారుడైన శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సామాజిక వర్గం తరపున నిర్వహిస్తున్న కార్తిక వనసమారాధన కార్యక్రమం రాజకీయాలకు వేదిక కాదని స్పష్టం చేశారు.
ఈరోజు బీసీ నేతలు ఎదిగారంటే ఎన్టీఆర్ పుణ్యమేనని.. పద్మశాలీలకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. పిలవని పేరంటానికి వచ్చి రాజకీయం చేస్తున్నారని చిరంజీవిపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఇరు వర్గాల వాదనలతో సమావేశంలో కాసేపు గందరగోళం నెలకొంది. కార్తిక వనసమారాధన కార్యక్రమం రాజకీయాలకు వేదిక కాదని పద్మశాలీ నాయకులు స్పష్టం చేశారు. దీంతో కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య వాదన చోటు చేసుకుంది.
ఇవీ చదవండి: