ETV Bharat / state

మాజీమంత్రి ప్రత్తిపాటిపై ఎస్సీ, ఎస్టీ కేసు.. ఎందుకంటే..? - చిలకలూరి పేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు

Case on Prathipati Pulla Rao: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎన్టీఆర్ సుజల తాగునీటి పథకం ప్రారంభంలో వివాదం నేపథ్యంలో.. తనను నెట్టివేశారని మున్సిపల్ అధికారి సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

TDP prathipati Pulla Rao
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై కేసు
author img

By

Published : May 14, 2022, 12:24 PM IST

Case on Prathipati Pulla Rao: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎన్టీఆర్ సుజల పథకం పునఃప్రారంభం సందర్భంగా జరిగిన ఘటనపై.. ప్రత్తిపాటితోపాటు తెలుగుదేశం నేతలపై చిలకలూరిపేట మున్సిపల్ అధికారి సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రత్తిపాటితోపాటు తెలుగుదేశం నేతలు తనను నెట్టివేశారంటూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. సునీత ఫిర్యాదు మేరకు.. ప్రత్తిపాటిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు... చిలకలూరిపేట చెరువు వద్ద ఉన్న ఎన్టీఆర్ సుజల ట్యాంకు ప్రారంభించేందుకు ప్రత్తిపాటి సిద్ధంకాగా.. దీనిపై మున్సిపల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాగునీటి పథకం బోర్లకు అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చారు. ఆయన్ని కారు దిగకుండా అడ్డుకున్నారు.

దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన తెలుగుదేశం కార్యకర్తలు.. పుల్లారావును అడ్డుకోవడం సరికాదంటూ ఆందోళన చేపట్టారు. కార్యకర్తల సాయంతో కారు దిగిన ప్రత్తిపాటి.. కొబ్బరికాయ కొట్టి తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో కొందరు కార్యకర్తల ఫోన్లను పోలీసులు లాక్కోవడంతో మళ్లీ వివాదం చెలరేగింది. ఫోన్లు ఇచ్చేయాలంటూ శ్రేణులతో కలిసి ప్రత్తిపాటి ఆందోళనకు దిగారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.