మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో.. అందుకు నిరసనగా ఎంపీడీవో కార్యాలయం వద్ద నియోజకవర్గ పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు సమావేశమయ్యారు. అక్కడి నుంచి ప్రదర్శనగా బస్టాండు కూడలికి చేరారు. ప్రధాన రహదారిపై కొంతసేపు రాస్తారోకో చేశారు. మంత్రివర్గంలో పిన్నెల్లికి చోటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ పదవులకు రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. సీఎంవో నుంచి కార్యదర్శి ధనుంజయరెడ్డి... పిన్నెల్లికి ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. ఎవరికీ అందుబాటులోకి వెళ్లలేదు. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, రెంటచింతల మండలాల పరిధిలో ప్రధాన రహదారులపై పిన్నెల్లి అనుచరులు రాస్తారోకోలు చేశారు. టైర్లు, ద్విచక్ర వాహనాలను దహనం చేసి నిరసన తెలిపారు. రెంటచింతల-5 ఎంపీటీసీ సభ్యురాలు పాముల సంపూర్ణమ్మ ఆత్మహత్యకు యత్నించగా.. అక్కడున్నవారు ఆమెను అడ్డుకున్నారు.
ఎవరికీ అందుబాటులో లేని పిన్నెల్లి.. అనుచరుల ఆందోళన - undefined
12:42 April 10
మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల సమావేశం