Missing child boy died in well: పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిన్న కనిపించకుండా పోయిన ఏడాది బాలుడు మృతి చెెందాడు. కాగా ఇంటి పక్కనే బావిలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం నుంచి తమ కుమారుడు కనిపించకపోవడంతో నరసరావుపేట గ్రామీణ పోలీసులకు తండ్రి వాసు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బావిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.
అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించామని.. బాలుడి మృతిపై మరింత లోతుగా విచారణ చేస్తున్నామని సీఐ భక్తవత్సలరెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి: