పల్నాడు జిల్లా దుర్గిలో మామిడికాయ ఆకారంలో ఉన్న కోడిగుడ్డు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. శ్రీనివాసరావు అనే కిరాణా వ్యాపారికి చెందిన దుకాణానికి తెప్పించిన కోడిగుడ్లలో.. ఒకటి మామిడికాయ ఆకారంలో ఉండటం గమనించాడు. గుడ్డు సైజులో హెచ్చుతగ్గులుంటాయి కానీ.. పూర్తిగా ఆకారం మారిపోయి ఉండటం వింతగా ఉందని షాపు యజమాని అన్నారు. దుకాణానికి వచ్చేవారు మామిడికాయ ఆకారంలోని గుడ్డుని ఆసక్తిగా తిలకిస్తున్నట్లు చెప్పారు.
ఇవీ చూడండి :