Three killed in a road accident పల్నాడు జిల్లా నకరికల్లు మండలం శాంతిపురం వద్ద జాతీయ రహదారిపై లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని రెంటచింతల మండలం పసర్లపాడుకు చెందిన వారుగా స్థానికులు గుర్తించారు. మృతుల వివరాలు అమరేశ్వర రావు (47) దొడ్డ భాస్కర్(40), ముని నాయక్(30) గా గుర్తించారు. ప్రమాదంలో డ్రైవర్ సైదులు, క్లినర్ ఏసు లకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగినట్లు స్థానికులు తెలియజేశారు. క్షతగాత్రులను ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు నకరికల్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీకి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: