ETV Bharat / state

ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ.. కేంద్రం హెచ్చరికతో దిగొచ్చిన రాష్ట్ర సర్కార్​!

Free Ration: ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. బియ్యం ఇవ్వకపోతే ధాన్యం సేకరణ నిలిపేస్తామని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఇటీవల హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి కార్డుదారులకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. దీనికి సంబంధించి శనివారం రేషన్‌ డీలర్లకు మార్గదర్శకాలు చేరాయి.

free ration
free ration
author img

By

Published : Jul 24, 2022, 4:05 AM IST

Free Ration: ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద ఉచిత బియ్యం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. బియ్యం ఇవ్వకపోతే ధాన్యం సేకరణ నిలిపేస్తామనే కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ హెచ్చరిక నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి కార్డుదారులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. అదీ జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) పరిధిలోని కార్డులకే.. రేషన్‌ దుకాణాల ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 1.45 కోట్ల రేషన్‌ కార్డుల్లో 88.75 లక్షల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డులకే ఉచిత బియ్యం అందనున్నాయి. మిగిలిన 56.60 లక్షల రాష్ట్ర రేషన్‌ కార్డులకు బియ్యం ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. దీనికి సంబంధించి పౌర సరఫరాలశాఖ జారీ చేసినట్లు చెబుతున్న మార్గదర్శకాలు శనివారం రేషన్‌ డీలర్లకు చేరాయి.

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలో ఉన్న కార్డుదారుల జాబితాలను గ్రామ రెవెన్యూ అధికారి లాగిన్‌కు పంపిస్తారు. వాటిని పంపిణీకి రెండు రోజుల ముందు వాలంటీర్ల ద్వారా కార్డుదారులకు అందిస్తారు. ఉచిత బియ్యంపై విస్తృత ప్రచారంలో భాగంగా కరపత్రాల పంపిణీ, రేషన్‌ దుకాణాలవద్ద బ్యానర్లు కట్టాలి. జులై 25వ తేదీ నుంచి బియ్యాన్ని రేషన్‌ దుకాణాలకు చేరవేయడం ప్రారంభించి 30వ తేదీలోగా పూర్తి చేయాలి. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి రేషన్‌ దుకాణాల డీలర్లు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులకు పీఎంజీకేఏవై బియ్యం పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

నలుగురుండే కుటుంబానికి 100 కిలోలు
పీఎంజీకేఏవై పథకం కింద ఏప్రిల్‌ నుంచి బియ్యం పంపిణీ నిలిచిపోయింది. అంటే ఆగస్టు నెలతో కలిపితే 5 నెలల బియ్యం ఇవ్వాలి. ఒక్కో కుటుంబ సభ్యుడికి నెలకు 5 కిలోల లెక్కన.. 5 నెలలకు 25 కిలోలు అందించాలి. ఒక కార్డులో నలుగురు కుటుంబ సభ్యులుంటే.. 100 కిలోల బియ్యం పంపిణీ చేయాలి. కేంద్రం భరించే రాయితీతో కలిపి చూస్తే.. 5 నెలలకు సుమారు రూ.4వేల విలువైన బియ్యం కార్డుదారులకు దక్కుతాయి. రాష్ట్ర కార్డుల వారికి ఇవ్వకపోతే ఈ మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. ఇలా ఒకే రేషన్‌ దుకాణం పరిధిలో కేంద్ర కార్డుదారులకు ఇచ్చి.. రాష్ట్ర కార్డుదారులకు ఇవ్వకపోతే వారి నుంచి నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కూపన్లపై విడతలవారీగా?
పీఎంజీకేఏవై కింద రాష్ట్రంలోని 88.75 లక్షల రేషన్‌ కార్డులకు నెలకు 1.34 లక్షల టన్నుల ఉచిత బియ్యం ఇవ్వాలి. ఇందులో 90% మంది రేషన్‌ తీసుకుంటే.. 5 నెలలకు కనీసం 6 లక్షల టన్నులైనా అవసరం. ఇంత పెద్ద మొత్తంలో రేషన్‌ బియ్యం నిల్వలు పౌర సరఫరాలశాఖవద్ద లేవు. అందుకే కూపన్లు ఇచ్చి.. వాటిపై విడతల వారీగా పంపిణీ చేసే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఉచిత బియ్యం పంపిణీపై పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌, సంస్థ ఎండీ వీరపాండియన్‌ను ‘ఈనాడు’ ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా స్పందించలేదు.

"పీఎంజీకేఏవై ఉచిత బియ్యం పంపిణీపై మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి సోమవారం నిర్వహించే విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు చెబుతాం. ఎంత మంది కార్డుదారులకు.. ఎప్పట్నుంచి.. ఎలా పంపిణీ చేస్తామో అన్ని వెల్లడిస్తాం"

- మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

ఇదీ చదవండి: జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలతో లబ్ధిదారులకు కష్టాలు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.