ETV Bharat / state

గ్రీన్ వ్యాలీ స్కూల్‌లో అగ్నిప్రమాదం... ఏసీలో మంటలు - పల్నాడు జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని గ్రీన్ వ్యాలీ స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పాఠశాల పైఅంతస్థులోని తరగతి గది ఏసీలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపకసిబ్బంది పాఠశాలకు చేరుకుని మంటలను అదుపు చేశారు. పదో తరగతి పరీక్ష ముగిసిన తర్వాత ప్రమాదం జరగటంతో ముప్పు తప్పింది.

fire accident
గ్రీన్ వ్యాలీ స్కూల్‌లో అగ్నిప్రమాదం
author img

By

Published : Apr 27, 2022, 5:17 PM IST

పల్నాడు జిల్లా చిలకలూరిపేట - నరసరావుపేట మార్గంలోని గ్రీన్ వ్యాలీ స్కూల్​లో బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల పై అంతస్తులోని తరగతి గదిలో ఏసీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి లోపలి యూనిట్ దగ్ధమైంది. ఆ వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంటలు ఏసీ వరకే పరిమితమవ్యడంతో పెద్ద ప్రమాదం తప్పిందని సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. గ్రీన్ వాలీ స్కూల్​లో గ్రౌండ్ ఫ్లోర్​లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు పరీక్ష అయిపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఇదీ చదవండి: Paper leak: పది ప్రశ్నపత్రం లీక్ అవాస్తవం.. స్పష్టం చేసిన అధికారులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.