Sarpanch unhappy with YSRCP : పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామ సర్పంచ్ లావూరి లక్ష్మమ్మ బాయి అధికార వైసీపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం తన భర్త చేసిన త్యాగాలకు గుర్తింపు లేకుండాపోయిందని కంటతడి పెట్టారు. ఎమ్మెల్యే కూడా బినామీ పేరిట బిల్లులు దండుకుంటున్నారని వాపోయింది.
గురజాల మండలం దైద గ్రామ సర్పంచ్ వైసీపీ మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం పొలం అమ్ముకున్నామని.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ గెలవడానికి ఎంతో కృషి చేశామని తెలిపింది. కానీ, ఈరోజు సర్పంచ్ జీతం కోసం మండల పరిషత్ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరిగే ఖర్మ పట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను, తన భర్త చాప్లా నాయక్ వైసీపీ కోసం ఎంతో శ్రమించామని.. తన భర్త కరోనాతో చనిపోతే పార్టీ అసలు పట్టించుకోలేదని, కనీసం గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.. ఇంటికి కూడా రాలేదని గుర్తు చేశారు. మేము దళిత, బడుగు బలహీన వర్గాలకు చెందినవాళ్లు కావడమే అందుకు కారణమా.. అని కన్నీరు మున్నీరైంది.
లోకల్‌గా ఉండే వైసీపీ సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు మమ్మల్ని తీసుకువెళ్లి.. మీరు ఎస్టీలు.. మీకు సర్పంచ్‌గా చేయడం చేతకాదు అని చెప్పి ప్రామిసరీ నోటు మీద సంతకాలు పెట్టించుకుని ఒక బినామీని పెట్టారు. ఆ బినామీ పేరు మీద బిల్లులు పెట్టి సంతకాలు చేయాలని మా మీద ఒత్తిడి తెచ్చి ఇబ్బందులకు గురి చేశారు. ఇక్కడ ఏమీ జరగట్లేదు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో న్యాయం జరుగుతుందని మీడియా ముందుకు వచ్చాం. -లావూరి లక్ష్మమ్మ బాయి, దైద గ్రామ సర్పంచ్
ఇవీ చదవండి :