ETV Bharat / state

నేడు 'జగనన్న చేదోడు' పథకం నిధులు విడుదల.. బటన్​ నొక్కనున్న సీఎం జగన్​ - జగనన్న చేదోడు

CM Jagan Vinukonda paryatana updates: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 'జగనన్న చేదోడు' పథకానికి సంబంధించిన నిధులను కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.

CM Jagan
సీఎం జగన్
author img

By

Published : Jan 29, 2023, 9:35 PM IST

Updated : Jan 30, 2023, 7:09 AM IST

CM Jagan Vinukonda paryatana updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 'జగనన్న చేదోడు' పథకానికి సంబంధించిన నిధులను కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,30,145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు 330.15 కోట్ల ఆర్ధిక సాయాన్ని విడుదల చేయనున్నారు. షాపులున్న రజకులకు, నాయి బ్రాహ్మణులకు, టైలర్లకు ఈ పథకం ద్వారా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.

సీఎం జగన్ వినుకొండలో ఈరోజు విడుదల చేయనున్న 330.15 కోట్ల ఆర్ధిక సాయంలో.. 1,67,951 షాపులున్న టైలర్లకు రూ.167.95 కోట్లు, 1,14,661 షాపులున్న రజకులకు రూ.114.67 కోట్ల లబ్ధి, 47,533 షాపులున్న నాయీబ్రాహ్మణులకు రూ.47.53 కోట్ల లబ్ధి చేకూరనుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.

అనంతరం సీఎం జగన్ నేటి వినుకొండ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్​ను అధికారులు విడుదల చేశారు. ''ఉదయం 10 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు వినుకొండ చేరుకుంటారు. 11.05 నుంచి 12.20 వరకు వినుకొండ వెల్లటూరు రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.'' అని షెడ్యూల్​లో వెల్లడించారు.

చెట్లు నరికివేత: సీఎం పర్యటన పేరుతో రాష్ట్రంలో చెట్ల నరికివేత కొనసాగుతుంది. గతంలో గుంటూరు, విశాఖ నగరంలో చెట్ల నరికివేతపై తీవ్ర విమర్శలు వచ్చినా.. అధికారులు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి పెట్టడం లేదు. తాజాగా పల్నాడు జిల్లాలో దాదాపు వంద పచ్చని చెట్లు గొడ్డలి వేటుకు బలి అయ్యాయి. వీటిపై సామాన్యులు సైతం అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు పర్యావరణ ప్రేమికుల్ని ఒకింత తీవ్ర మనోవ్యధకు గురిచేస్తున్నాయనే వాదన వ్యక్తమవుతోంది.

ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డి భద్రత పేరుతో ఆర్టీసీ బస్టాండు రోడ్డులో డివైడర్ మధ్యలో ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను అడ్డంగా నరికేశారు. భద్రత పేరుతో అధికారులు చెట్లను శనివారం రాత్రి రంపంతో కోయించారు. సీఎం హెలిపాడ్ ల్యాండింగ్ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో సుమారు 50 చెట్లు, సభ ప్రాంగణానికి వెళ్లే మార్గంలో సుమారు 50కి పైగా చెట్లను ఇలా నరికేశారు. భద్రత సిబ్బంది సూచనల మేరకు తొలగిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మరియు డీఈఈ వెంకయ్య తెలిపారు.

ఇవీ చదవండి

Last Updated : Jan 30, 2023, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.