ETV Bharat / state

Housing scheme in ap పల్లె పేదలకు జగన్‌ సర్కారు సొంతంగా ఒక్క ఇల్లూ కట్టలేదు.. స్థలాలు ఇచ్చి సరిపెట్టేశారు - jagananna colony

AP House Construction : రాజధాని అమరావతిలో స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శరవేగంగా అడుగులు వేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. 2020లో ఇళ్ల స్థలాలు కేటాయించిన గ్రామీణ పేదలకు మాత్రం ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. గ్రామాల్లో కేంద్రం నిధులతోనే ఇళ్ల నిర్మాణం సాగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించే ప్రయత్నమే చేయలేదు. పేదల తల రాతలను మార్చేందుకే స్థలాలు కేటాయించి ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని చేపడుతున్నామంటూ.. పదే పదే చెప్పే సీఎం జగన్‌ ఆ తలరాత మార్చే వారిలో గ్రామీణ పేదలు లేరా?.. ఉంటే మరి రెండున్నరేళ్లుగా ఎందుకు ఇళ్లు మంజూరు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

AP House Construction
ఏపీలో గృహనిర్మాణం
author img

By

Published : Jun 5, 2023, 8:20 AM IST

YSRCP Government on Houses Construction : ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం, వాటిలో ఇళ్లు కడుతున్నాం అంటూ చెప్పిన సీఎం జూన్‌ 2023 నాటికి అన్నీ పూర్తి చేసేస్తామని చెప్పారు. ఆ సమయం రానే వచ్చింది. కానీ ఆయన చెప్పిన ఇళ్లలో ఎన్ని ఇళ్లు పూర్తి అయ్యాయో మాత్రం ఎవరికీ తెలియదు. గ్రామాల్లో అయితే పరిస్థితి మరింత దారుణం. ఇళ్లు కట్టించేందుకు తాము చర్యలు చేపడుతుంటే.. దేవతల యజ్ఞానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల కొత్త పల్లవి అందుకున్నారు. ఎవరు అడ్డుపడితే రెండున్నరేళ్లయినా 2 లక్షల మంది గ్రామీణ పేదలకు.. ఇళ్లు మంజూరు చేయలేదనే ప్రశ్నను లబ్ధిదారులు సంధిస్తున్నారు. మఖ్యమంత్రికి 2 లక్షల మంది గ్రామీణ పేదల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు కనిపించలేదా అని మండిపడుతున్నారు.

వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు గ్రామీణ పేదలకు సొంతంగా ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. వినడానికి అతిశయోక్తిగా ఉన్నా ఇదే వాస్తవం. ప్రస్తుతం నిర్మిస్తున్న 18.64 లక్షల గృహాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయంతో నెట్టుకొస్తున్నవే. కేంద్ర ప్రభుత్వం ఇన్ని గృహలను మంజూరు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 2 లక్షల మందికి ఇళ్లు ఇవ్వలేదా?.. దీనికి నాలుగు సంవత్సరాల సమయం పడుతుందా అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

16.84 లక్షలు గృహాలు నగరాలు, పట్టణాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో ఉంటే, మరో 1.80 లక్షలు గృహాలు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ పథకం కింద కేంద్రం మంజూరు చేసినవే. వీటిని ప్రస్తుతం కడుతున్న 18.64 లక్షల ఇళ్ల నిర్మాణంలోనే లెక్క చూపుతున్నారు. జగనన్న కాలనీల్లోని మౌలిక వసతుల కల్పనకు మినహాయించి ఈ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం నామమాత్రమే. ఒక్కో ఇంటికి ఇస్తున్న లక్షా 80 వేల రూపాయల్లో పట్టణాల్లో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 30 వేల రూపాయలే. పట్టణాభివృద్ధి సంస్థల్లో మొత్తం లక్షా 80 వేల రూపాయలు కేంద్ర నిధులే.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లతోపాటు సొంతంగా ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకం కింద గ్రామీణ పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇంటి నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీలకు 2 లక్షలు చొప్పున, ఇతర వర్గాలకు లక్షన్నర చొప్పున అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఆర్థిక సాయం అందించింది.

నగరాలు, పట్టణాల్లో కేంద్రం ఇస్తున్న ఆర్థిక సాయంతో పేదల ఇళ్ల నిర్మాణాన్ని నెట్టుకొస్తున్న ప్రభుత్వం.. గ్రామాల్లోని పేదలను మాత్రం పట్టించుకోవడం లేదు. 2020లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే సమయంలో రెండో దశలో చేపట్టే ఇళ్ల నిర్మాణాల్లో వీటిని చేర్చారు. 8 నెలల క్రితమే రెండో దశ కింద సుమారు 3 లక్షల నిర్మాణాలను ప్రారంభించారు. విశాఖపట్నం పరిధిలో చేపట్టే లక్షా 14వేల గృహాలతోపాటు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదలకు అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ పథకం ఎంపిక చేసిన లక్షా 80 వేల గృహాలు ఇందులో ఉన్నాయి. ఆ సమయంలో కూడా గ్రామీణ పేదల ఇళ్ల నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అమరావతిలో ఇటివలే చేపట్టిన 50 వేల మందికి పట్టాల పంపిణీకి సంబంధించి కేంద్రం ఇంకా ఇళ్లు మంజూరు చేయాల్సి ఉంది. కానీ అక్కడ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం హడావుడి చేస్తోంది. షియర్‌వాల్‌ సాంకేతికతతో కట్టేస్తామని చెబుతోంది. అయితే గ్రామీణ పేదల ఇళ్ల మంజూరుపై నిర్లిప్తంగా ఉంది. కనీసం ఎప్పుడు వీటిని ప్రారంభిస్తారనే సమాచారం లబ్ధిదారులకు లేదు. దీంతో వారు అయోమయంలో ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన 2 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల పేదల ఇళ్ల నిర్మాణం కోసం.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు పథకాలు కూడా వర్తించవు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ఆ పథక లబ్ధిదారులను గతంలోనే ఎంపిక చేసింది. ఏపీలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకానికి లక్షా 80 వేల మంది అర్హులున్నట్లు గుర్తించి.. వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. 2020 సంవత్సరంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించని గ్రామీణ ఇళ్లు సుమారు 4 లక్షల వరకు ఉంటాయని అంచనా వేశారు. వీటి నిర్మాణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి. దీనికి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసి.. పట్టణాభివృద్ధి సంస్థల విస్తీర్ణాన్ని పెంచింది. కొన్ని కొత్త పట్టణాభివృద్ధి సంస్థలనూ ప్రకటించింది. దీంతో కొందరు గ్రామీణ లబ్ధిదారులు వాటి పరిధిలోకి వెళ్లారు. అయినా ఇంకా 2 లక్షల మంది మిగిలి ఉన్నారు. వీరంతా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామీణ పేదలకు ఇళ్ల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. గృహనిర్మాణశాఖ అధికారులు చెబుతున్నారు.

రెండున్నరేళ్లయినా 2 లక్షల మంది గ్రామీణ పేదలకు మంజూరు కాని ఇళ్లు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.