ETV Bharat / state

YSRCP Government Wasting Public Money: ప్రభుత్వ నిర్వాకం.. ప్రణాళికా లోపంతో రూ. 557 కోట్ల ప్రజాధనం 'పునాదుల' పాలు - ap telugu news

YSRCP Government is Wasting Public Money: ప్రభుత్వానికి ఒక ప్రణాళిక, విధానం లేకపోతే ప్రజాధనం ఎలా.. దుర్వినియోగం అవుతుందో చెప్పడానికి గ్రామాల్లో పునాది దశలో నిలిచిపోయిన పలు భవన నిర్మాణాలే నిదర్శనం. ప్రతి పంచాయతీలోనూ అయిదు రకాల భవన నిర్మాణాలకు మొదట అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేసింది. పునాదుల దశలో ఉన్న భవన నిర్మాణ పనులు నిలిపి వేయాలన్న తాజా ఆదేశాలతో ఇప్పటి వరకు ఖర్చు చేసిన కోట్ల రూపాయలు 'బూడిదలో పోసిన పన్నీరు'గా మారింది.

ysrcp_government_is_wasting_public_money

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2023, 12:38 PM IST

YSRCP Government is Wasting Public Money : ప్రతి పంచాయతీలోనూ గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, పాలశీతలీకరణ కేంద్రం, డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఆచరణలో నీరుగారిపోయింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 36 వేలకు పైగా భవనాలు నిర్మించాలని మొదట ప్రతిపాదించారు.

YSRCP Government is Wasting Public Money: ప్రభుత్వ నిర్వాకం.. రూ. 557 కోట్ల ప్రజాధనం పునాదుల పాలు.. జగన్‌కు చురకలు అంటిస్తున్న విపక్షాలు

CM Jagan Wasted 557 Crores : వివిధ అంశాలను పరిగణలోనికి తీసుకున్న అనంతరం చివరకు 34,586 భవన నిర్మాణ పనులను మూడున్నరేళ్ల కిందట ప్రారంభించారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మొదటి రెండున్నరేళ్లు పనుల్లో తీవ్ర జాప్యమైంది. పెట్టుబడి పెట్టిన కొందరు సర్పంచులు అప్పుల పాలయ్యారు. పెండింగ్ బిల్లుల కోసం మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పునాదుల దశలో ఉన్న పనులను నిలిపి వేయాలన్న ఆదేశాలతో పక్కన పెట్టారు. సచివాలయ భవనానికి పునాదుల్లోపు పనులకు ఒక్కో దానిపై రూ.6.50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. ఇతర భవనాల పై ఒక్కో.. దానిపై రూ.5 లక్షలు వెచ్చించారు. ఇలా పునాదుల దశలో నిలిపివేసిన భవనాలపై 557 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు.

జగన్ మామ! ఇలా జరిగిందేంటీ..? ఉన్నతాధికారుల ప్రణాళిక లోపంతో కోట్లరూపాయలు వృధా !

CM Jagan Failed to Implement 5 Kinds of Building Policy in Panchayats : పంచాయతీల్లో 5 రకాల భవన నిర్మాణాలను ఉపాధి హామీ పథకం కింద 9,871 కోట్ల రూపాయల మెటీరియల్ నిధులతో పూర్తి చేయాలని ప్రతిపాదించారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల కంటే.. పనులు అంచనా వ్యయం ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక బెడిసి కొట్టింది. దీంతో భవనాల సంఖ్యను తగ్గిస్తూ చివరకు పునాది దశ వరకు పనులు జరిగిన 10,483 నిర్మాణాలను నిలిపి వేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డాంగే నగర్‌లో సుమారు 96లక్షల రూపాయలతో ఏడాది క్రితం చేపట్టిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అసంపూర్తిగా నిలిచిపోవడంతో దీని చుట్టుపక్కల పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా మారింది.

గుర్వాయిగూడెం గ్రామంలోని సచివాలయం పక్కనే విలేజ్‌ క్లినిక్‌ భవనం స్లాబ్‌ దశలో నిలిచిపోయింది. పట్టెన్నపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ క్లినిక్‌ భవనాలు పునాదల దశకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలతో అప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు చెల్లించే ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మిగిలిన పనులు చేపట్టవద్దని నిర్వాహకులను అధికారులు ఆదేశించారు.

లీకేజ్ ప్రాబ్లమ్: "వృథాగా పారుతున్న" కోటి రూపాయల ప్రజాధనం..!

నెల్లూరు జిల్లాలో 250 కోట్ల రూపాయలతో 659 గ్రామ సచివాలయ భవనాలు నిర్మించాలని అంచనా వేశారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం 160 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 322 మాత్రమే పూర్తి చేశారు. 94కోట్ల రూపాయల అంచనాలతో 539 గ్రామ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు చేపట్టాలని అంచనా వేయగా..నిధుల కొరతతో కేవలం 132 భవనాలు మాత్రమే పూర్తి చేశారు. 265 భవనాలు అసలు ప్రారంభానికి నోచుకోని దుస్థితి. వాటితో పాటు 142 కోట్ల రూపాయల అంచనాలతో 653 రైతు భరోసా కేంద్రాలు నిర్మించాలని అధికారులు భావించినప్పటికీ కేవలం 221 భవనాలు మాత్రమే పూర్తి చేశారు.

వీటితో పాటు వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీ భవనాలు, బల్క్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్‌ కేంద్రాలు అతీగతీ లేకుండా పోయాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులతో గ్రామాల్లో దాదాపు 23 లక్షల కిలోమీటర్లకు పైగా కొత్త సిమెంట్ రహదారుల నిర్మాణాలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి మెటీరియల్ నిధులతో భవన నిర్మాణాలకే ప్రాధాన్యమిచ్చింది. గ్రామాల్లో కొత్త రహదారుల నిర్మాణ పనుల మంజూరును ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలోనే నిలిపి వేసింది. దీంతో ప్రతి జిల్లాలోనూ వేల సంఖ్యలో ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి.

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించినట్లు పదేపదే ప్రకటించే జగన్ ప్రభుత్వం చివరకు గ్రామాల్లో ప్రారంభించిన భవనాల పనులను కూడా పూర్తి చేయించలేకపోయిందని విపక్షాలు, ప్రజలు పెదవి విరుస్తున్నారు.
త్వరగా పీహెచ్​సీ భవనాలు నిర్మించండి సారూ.. అనారోగ్యంతో బాధపడుతున్నాం..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.