ETV Bharat / state

YSRCP Government Did Not Fund the Drinking Water Schemes: ఆరంభ శూరత్వంగా మిగిలిపోతున్న తాగునీటి పథకాలు.. నిధులివ్వని జగన్‌ ప్రభుత్వం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2023, 8:55 AM IST

Updated : Oct 20, 2023, 9:35 AM IST

YSRCP Government Did Not Fund the Drinking Water Schemes: రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉంటున్నారంటూ ప్రతి సభలోనూ సీఎం జగన్‌ ఊదరగొడుతుంటారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీసం ప్రజల దాహార్తిని తీర్చలేకపోతుంది. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని జగన్‌ ప్రవేశపెట్టిన వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. వైసీపీ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో తాగునీటి ప్రాజెక్టులు అటకెక్కాయి. దీంతో చాలా గ్రామాల ప్రజలు దాహార్తితో బాధపడుతున్నారు.

YSRCP Government Did Not Fund the Drinking Water Schemes
YSRCP Government Did Not Fund the Drinking Water Schemes
YSRCP Government Did Not Fund the Drinking Water Schemes: ఆరంభ శూరత్వంగా మిగిలిపోతున్న తాగునీటి పథకాలు.. నిధులివ్వని జగన్‌ ప్రభుత్వం

YSRCP Government Did Not Fund the Drinking Water Schemes : జలాశయాల నుంచి నీటిని పైపులైన్లు, కాలువల ద్వారా తాగునీటి పథకాలకు సరఫరా చేస్తే గ్రామాల్లో దాహార్తి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని 2022 మే 3న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు. ఇందుకోసం కార్యాచరణ రూపొందించి, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశాలు, బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జగన్ చెప్పే గొప్పలకు లోటు ఏమీ ఉండదు. కానీ ఆచరణలో మాత్రం ఏదీ జరగదు.

Drinking Water Schemes in AP : గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించేలా రూపొందిస్తున్న భారీ పథకాలు నీరుగారిపోతున్నాయి. ఏళ్లు గడిచినా నిధుల కేటాయింపు లేక నీరసపడిపోతున్నాయి. ఫలితంగా సర్వేలు, డిజైన్ల తయారీ పేరుతో కాలయాపనకు తోడు పనులు శంకుస్థాపనలకే పరిమితమై ఇంటింటికీ తాగునీటి వసతి అటుంచి దాహార్తి తప్పని పరిస్థితి నెలకొంది.

Drinking Water Problems in AP : ఈ ఏడాది వేసవిలో మొదలైన తాగునీటి ఎద్దడి సమస్య ఇప్పటికీ అనేక జిల్లాల్లో కొనసాగుతోంది. తాగునీరు అందించండి మహా ప్రభో అంటూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిధులివ్వకుండా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేసిన గుత్తేదారులకే బిల్లులు సరిగా చెల్లించని జగన్ ప్రభుత్వం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందంటే ప్రజలు ఎలా నమ్మగలరు.

Drinking Water Problems in West Godavari District: ప్రతిపక్షంలో హామీలిచ్చారు.. అధికారంలోకి వచ్చాక అమలు మరిచారు

CM Jagan Neglect the Water Grid Project : జగన్ ప్రభుత్వం తాగునీటి సమస్య పరిష్కారానికి 2019 అక్టోబరులో 46 వేల 6వందల 75 కోట్ల రూపాయల అంచనాలతో మొదట వాటర్ గ్రిడ్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. పోలవరం, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రధాన ప్రాజెక్టుల నుంచి తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు పైపులైన్ల ద్వారా నీరు అందించేలా ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును రూపొందించారు. తొలి దశలో 37 వేల 4 వందల 75 కోట్లు, రెండో దశలో మరో 9 వేల 2 వందల కోట్లు అవసరమని అంచనా వేశారు.

ఈ మేరకు కొన్ని పనులకు శంకుస్థాపనలూ చేశారు. ఈ ప్రాజెక్టుకు నాబార్డు నుంచి నిధులు సమీకరించాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో వాటర్ గ్రిడ్ ప్రతిపాదన మూలకు చేరింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, కర్నూలు జిల్లా డోన్, కడప జిల్లా పులివెందులలో చేపట్టిన పనులకు ప్రభుత్వం నిధులు సమకూర్చినా మిగతా జిల్లాల్లో పనులను మాత్రం పూర్తిగా పక్కన పెట్టారు.

Drinking Water Crisis In AP : ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రతిపాదనను పక్కన పెట్టినప్పటికీ తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ఆరు జిల్లాల్లో తాగునీటి పథకాల కోసం ఏడాదిన్నర క్రితం 7వేల 9వందల 10 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, విజ్జేశ్వరం బ్యారేజీ నుంచి పశ్చిమ గోదావరి, వెలిగొండ ప్రాజెక్టు నుంచి ఉమ్మడి ప్రకాశం, గండికోట రిజర్వాయర్ నుంచి ఉమ్మడి చిత్తూరు, దోసపాడు కాలువ, బంటుమిల్లి ప్రధాన కాలువ, కృష్ణా నదిలోని ఇన్‌ఫిల్ట్రేషన్‌ బావులు, కృష్ణా ఈస్ట్రన్ బ్యాంకు కెనాల్ నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని గ్రామాలకు, బుగ్గవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నాగార్జునసాగర్ నుంచి ఉమ్మడి గుంటూరులోని పల్నాడు ప్రాంతానికి తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు.

Women Protest For Water on Road : 'మా గ్రామం ఉన్నట్టయినా గుర్తుందా..' అధికారులపై గ్రామస్థుల ఆగ్రహానికి కారణమేంటంటే..?

YCP Govt Failed to Supply Drinking Water in AP : ఈ మేరకు గ్రామాల్లో ఇప్పటికే ఉన్న ఓవర్ హెడ్ రిజర్వాయర్లు ఉపయోగించుకోవడంతో పాటు అవసరమైన చోట కొత్తవి నిర్మించాలని ప్రతిపాదించారు. అంచనా వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం , కేంద్ర ప్రభుత్వ జల్‌జీవన్ మిషన్ నుంచి మరో 50 శాతం నిధులు వెచ్చించాలని నిర్ణయించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆరు జిల్లాల్లో ఎక్కడా పనులు ప్రారంభం కాలేదు. కేవలం పైపులైన్ల ఏర్పాటు, ఇతర సాంకేతిక అంశాలపై సర్వేలు, డిజైన్ల తయారీ పేరుతో కాలయాపన చేస్తున్నారు.

Agitation for Drinking Water in Gooty అనంతపురం గుత్తిలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన..

Last Updated : Oct 20, 2023, 9:35 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.