ETV Bharat / state

వైయస్సార్​సీపీ నేతలలో ఆందోళన తీవ్రస్థాయికి చేరింది: యనమల రామకృష్ణుడు

Yanamala Ramakrishnudu: విభజన హామీల అమలులో జగన్‌ విఫలమయ్యారని టీడీపీ శాసన మండలిప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. టీడీపీ సభలకు వస్తున్న జనసునామీని చూసి వైయస్సార్​సీపీ నేతలలో ఆందోళన తీవ్రస్థాయికి చేరిందని అన్నారు.

Yanamala Ramakrishnudu
యనమల రామకృష్ణుడు
author img

By

Published : Nov 20, 2022, 3:58 PM IST

Yanamala Ramakrishnudu: టీడీపీ సభలకు వస్తున్న జనసునామీని చూసి నేతలు ఓటమి భయంతో వణికుతున్నారని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. న్యాయస్థానాల వ్యాఖ్యలతో వైకాపా నేతల్లో ఆందోళన తీవ్ర స్థాయికి చేరిందని.. అందుకే ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల భూ కబ్జాలు, ఖనిజ సంపద దోపిడీ ఇష్టానుసారం కొనసాగుతోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలులో జగన్‌ పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. అభివృద్ధిని నిలిపివేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని దుయ్యబట్టారు.

స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల భవిష్యత్తును బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల తలరాతలు మారస్తానన్నా ముఖ్యమంత్రికి.. పారిపాలన చేతకావటం లేదని నిరూపితం అయ్యిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి.. దివాళా తీసే పరిస్థితికి తీసుకువచ్చారని విమర్శించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.