Vijayawada Durga malleswara Swamy Temple : భవానీ దీక్షల విరమణ వల్ల దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి కోటిన్నర రూపాయల ఆదాయం సమకూరిందని ఆ ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. 2023 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆలయ ప్రాంగణంలో ఆమె ఆవిష్కరించారు. విజయవాడలో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఇటీవల ముగిసిన ఐదు రోజుల భవానీ దీక్షల విరమణలో ఈ ఆదాయం సమాకూరినట్లు ఆమె వెల్లడించారు. అంచనాల ప్రకారం ఐదు లక్షల 40 వేల మంది భక్తులు భవానీ దీక్ష విరమణ సమయంలో అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. గతంలో కంటే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కోన్నారు.
భక్తుల కానుకలు, ఇతర ఆదాయాలన్నింటిని కలుపుకుని సుమారు ఏడు కోట్ల 60 లక్షల రూపాయల ఆదాయం సమకూరిందని.. అందులో ఆరు కోట్లు రూపాయల వరకు వ్యయం అయిందని ఈవో తెలిపారు. గత సంవత్సరం కంటే రెండు లక్షల లడ్డూ ప్రసాదం అదనంగా విక్రయం జరిగిందని తెలిపారు. తాత్కాలిక ఏర్పాట్లు.. తొలగింపులు కాకుండా మాస్టర్‌ప్లాన్ ప్రకారం విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శాశ్వత ప్రాతిపదిన ఏర్పాట్లు చేయబోతున్నట్లు ఆమె తెలిపారు.
ఇవీ చదవండి: