ETV Bharat / state

27 నుంచి లోకేశ్ 'యువగళం' పాదయాత్ర.. భద్రత కల్పించాలని డీజీపీకి వర్ల లేఖ

Varla Ramaiah : ఈ నెల 27నుంచి యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్ర​ నిర్వహించనున్నట్లు గతంలో టీడీపీ స్పష్టం చేసింది. ఈ పాదయాత్రకు టీడీపీ ముందస్తుగా అన్ని ఏర్పాట్లను చేస్తోంది. అందులో భాగంగా డీజీపీని అనుమతి కోరుతూ లేఖ రాసింది.

Varla Ramaiah
వర్ల రామయ్య
author img

By

Published : Jan 9, 2023, 2:53 PM IST

Varla Ramaiah : ఈ నెల 27 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ చేపట్టనున్న 'యువగళం' పాదయాత్రకు అనుమతి కోరుతూ.. టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. పాదయాత్రకు అనుమతితో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. లోకేశ్​ను లక్ష్యంగా చేసుకుని ఇటీవల కొంతమంది సంఘ విద్రోహ శక్తులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజకీయ వ్యతిరేకులు, ఫ్యాక్షనిస్టుల నుంచి లోకేశ్​ ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్​ పాదయాత్రకు, రాత్రిపూట బసకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరారు.

భద్రతా ఏర్పాట్లు చూసుకునేలా రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలు ఇవ్వాలని డీజీపీని కోరారు. పాదయాత్రకు సంబంధించిన వ్యవహారాలను లోకేశ్​ వ్యక్తిగత స్టాఫ్​ నరేష్ చూసుకుంటారని లేఖలో పేర్కొన్నారు. ఇదే లేఖను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా వర్ల జత చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.