ETV Bharat / state

Jagananna Palle Velugu: 'చంద్ర కాంతి'ప్రాజెక్టుపై వైఎస్సార్​సీపీ ప్రభుత్వ కత్తి.. పల్లెల్లో వెలగని వీధి దీపాలు - Responsible for project management of LED lamps

LED LIGHTS: ప్రభుత్వం ఏదైనా ప్రజా సంక్షేమమే పరమావధి కావాలి. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ దారి వేరే కదా! గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ప్రజోపయోగ పథకం ఏదైనా.. పేరు మార్చడం.. లేదంటే నిర్వీర్యం చేయడమే ఎజెండా!. ఈ క్రమంలోనే గ్రామాల్లో వెలుగులు నింపేందుకు గత ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ వీధి దీపాల 'చంద్ర కాంతి' ప్రాజెక్టు పేరునూ 'జగనన్న పల్లె వెలుగు'గా మార్చారు. కానీ పేరుకే పల్లె వెలుగు..క్షేత్ర స్థాయిలో నిధుల గ్రహణంతో చీకట్లు కమ్ముకున్నాయి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 30, 2023, 7:17 AM IST

Updated : Jun 30, 2023, 11:03 AM IST

పల్లెల్లో వెలగని వీధి దీపాలు

Jagananna Palle Velugu 2023 : గ్రామాల్లో ఎల్‌ఈడీ దీపాల ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత చూసే కేంద్రం ఆధ్వర్యంలోని ఇంధన సామర్ధ్య సేవల సంస్థ (ఈఈఎస్‌ఎల్‌) కు రాష్ట్ర ప్రభుత్వం 651.55 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది. వీధి దీపాల నిర్వహణ బాధ్యతను మళ్లీ పంచాయతీలకే అప్పగించి చేతులు దులుపుకుంది. కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద విద్యుత్తు పంపిణీ సంస్థలకు సర్దుబాటు చేసి పంచాయతీల ఖాతాలు ఖాళీ చేశారు. దీంతో నిధుల లేమితో వీధి దీపాల నిర్వహణ పంచాయతీలకు గుదిబండగా తయారైంది. గ్రామాలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి.

సంప్రదాయ వీధి దీపాల వ్యవస్థ స్థానంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో 24.88 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. ఇంధన సామర్ధ్య సేవల సంస్థ , నూతన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థలకు వీటి ఏర్పాటుతోపాటు నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో అప్పగించింది. ఎల్‌ఈడీల ఏర్పాటుతో విద్యుత్తు వినియోగం తగ్గడం ద్వారా ఆదా అయిన మొత్తంలో ఈఈఎస్‌ఎల్‌, ఎన్‌ఆర్‌ఈడీసీకి 80 శాతం చెల్లించేలా, మిగతా 20శాతం పంచాయతీలకు చెందేలా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాజెక్టు నిర్వహణ సంస్థలకు నిధులు సరిగా చెల్లించడం లేదు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం వాయిదా మొత్తాలు చెల్లించకపోవడంతో ప్రాజెక్టు నిర్వహణ చూసే ఈఈఎస్‌ఎల్‌, ఎన్‌ఆర్‌ఈడీసీలు పాత బకాయిలు చెల్లిస్తే చాలన్న నిర్ణయానికి వచ్చాయి. ఇందుకోసం ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి నుంచి వీధి దీపాలు నిర్వహణను మళ్లీ పంచాయతీలకు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది.

14, 15 ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి పంచాయతీల విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఇప్పటికే 12 వందల 45 కోట్ల రూపాయలు సర్దుబాటు చేసింది. ఆస్తి పన్ను, ఇతర పద్దుల కింద వచ్చే ఆదాయంలో నుంచీ ఇంకా బకాయిలు ఉంటే చెల్లించాలని ఒత్తిడి పెడుతోంది. 2022-23 సంవత్సరానికి కేటాయించిన 2 వేల కోట్ల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులూ తన దగ్గరే పెట్టుకుంది. ఈ పరిణామాలతో ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న పంచాయతీలు ఎల్‌ఈడీ వీధి దీపాల నిర్వహణ విషయంలో చేతులెత్తేస్తున్నాయి. తాత్కాలిక విధానంలో పని చేస్తున్న ఎలక్ట్రీషియన్లకు ఆరేడు నెలలుగా జీతాలు కూడా బకాయి పడ్డాయి.

ఇంధన సామర్ధ్య సేవల సంస్థ 2017 జులై 17, 2018 డిసెంబరు 27న ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ట్రైపాట్‌ ఒప్పందం మేరకు గ్రామాల్లో మూడు విడతల్లో 23.69 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేసింది. వీటితో ఏటా 300 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఆదాతో పాటు 180 కోట్ల రూపాయల విద్యుత్తు ఖర్చు కూడా తగ్గినట్లు అంచనా. ప్రస్తుత ప్రభుత్వంలో ఈఈఎస్‌ఎల్​కు చెల్లించాల్సిన మొత్తాలు 522.74 కోట్లు కాగా..సకాలంలో చెల్లించనందుకు జరిమానా మరో 128.81 కోట్లు కలిపి మొత్తం బకాయిలు 651.55 కోట్ల రూపాయలకు చేరాయి. తక్షణం వీటిని చెల్లించాలని ఈఈఎస్‌ఎల్‌ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లీగల్‌ నోటీస్‌ పంపింది.

Last Updated : Jun 30, 2023, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.