ETV Bharat / state

విజయవాడలో ఆది ఆంధ్ర సమ్మేళనం.. పాల్గొన్న కేంద్ర మంత్రి నారాయణస్వామి - Union Minister calls for efforts to curb

105 years of Adi Andhra Association: ఆది ఆంధ్ర సమ్మేళనం 105 సంవత్సరాలు అయిన సందర్భంగా విజయవాడ నగరంలోని సామాజిక సమరస్యత సమ్మేళన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్రీయ సామాజిక న్యాయం, సాధికారిత సహాయ మంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. దేశాన్ని ఎన్ని పార్టీలు పాలించినా అసమానతలు అలాగే ఉన్నాయని నారాయణస్వామి తెలిపారు.

105 years of Adi Andhra Association
105 years of Adi Andhra Association
author img

By

Published : Nov 6, 2022, 8:36 PM IST

105 years of Adi Andhra Association: దేశాన్ని ఎన్ని పార్టీలు పాలించినా.. అసమానతలు అలాగే ఉన్నాయని కేంద్ర రాష్ట్రీయ సామాజిక న్యాయం, సాధికారిత సహాయ మంత్రి నారాయణస్వామి తెలిపారు. సమాజంలో అంటరానితనం, సాంఘిక బహిష్కరణలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆది ఆంధ్ర సమ్మేళనం 105 సంవత్సరాలు అయిన సందర్భంగా విజయవాడ నగరంలోని సిద్దార్ధ ఆడిటోరియంలో సామాజిక సమరస్యత సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో శ్రీ భువనేశ్వరి పీఠాధీపతులు కమలానంద భారతీ స్వామి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఉప సభపతి మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంగిపూడి వెంకటశర్మ రాసిన 'నీరుద్ధ భారతం', 'పద్యం', 'అర్థం'.. ఆచార్య వెంకటేశ్వర్లు రచించిన 'కృష్ణానదీ తీరాన సమతా ఉద్యమాలు', రచయిత ఆచార్య పులి కొండ సుబ్బాచారి రచించిన 'వచన నీ భారతం' పుస్తకాలను అతిథులు అవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్వతంత్య్ర భారతంలో అమృత్ మహోత్సవం గొప్ప కార్యక్రమమన్నారు. సమాజంలో సంస్కరణల ద్వారానే మార్పు సాధ్యమన్నారు. మన దేశంలో రాజ్యాంగ బద్దమైన విధానాలు పూర్తిగా అమలవడం లేదని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.