ETV Bharat / state

గొల్లపూడిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య - ap crime news

Family Committed Suicide: ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Suicide
ఆత్మహత్య
author img

By

Published : Mar 17, 2023, 4:35 PM IST

Family Committed Suicide: ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు కొత్తమాసు రాజేశ్వరి, నాగ ఫణీంద్ర, వెంకట సాయి మోహన సుధాగా పోలీసులు గుర్తించారు. నాగ ఫణీంద్ర, వెంకట సాయి మోహన సుధా భార్యాభర్తలు కాగా వీరితో పాటు నాగ ఫణీంద్ర తల్లి రాజేశ్వరి కూడా మృతి చెందినవారిలో ఉన్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న భవానీపురం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్న భార్యాభర్తల మధ్య ఎలాంటి వివాదాలు లేవని బంధువులు చెబుతున్నారు. అయితే వాళ్లు చనిపోయే మందు సూసైడ్ నోట్ రాశారని.. అది పరిశీలిస్తే మరింత సమాచారం తెలియవచ్చని అంటున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

"మాకు ఎటువంటి సమాచారం రాలేదు. మా అల్లుడు వాళ్ల అన్నయ్య గారు ప్రతి రోజూ వెళ్లి చూసేవారు.. ఆయన ఫోన్ చేసి చెప్తే తెలిసింది. వాళ్లు మాకు ఏం చెప్పలేదు. మా అమ్మాయి కూడా ఏం చెప్పలేదు. ఏదో స్లిప్ రాశారు అంటా.. అది చూస్తే ఏం జరిగిందో ఏంటో తెలియచ్చు. మా అల్లుడి గారికి ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేవు". - ఆంజనేయులు, మృతుల బంధువు

"మాకు పొద్దున్న ఫోన్ వచ్చింది. వాళ్ల అన్నయ్యగారు ఫోన్ చేశారు. తలుపు కొడితే తీయట్లేదని.. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుందని అన్నారు. దీంతో వాచ్​మెన్ సాయంతో తలుపు బద్దలుగొట్టి వెళ్లి చూశారు. చూసే సరికి వాళ్లు ఉరి వేసుకుని ఉన్నారు. మా అత్తయ్యగారు ఏమో.. తన రూమ్​లో చనిపోయి ఉన్నారు. కారణం ఏంటో మాకు కూడా సరిగ్గా తెలియదు. భార్యాభర్తలు ఇద్దరూ మంచిగానే ఉంటారు. చాలా సంతోషంగా ఉండేవారు. ఆర్థికంగా చిన్న సమస్యలు ఉండేవి. ఆ వివరాలు అన్నీ సూసైడ్ నోట్​లో రాశారని అంటున్నారు" - మృతుల బంధువు

"ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో మాకు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది. దాని ప్రకారం గొల్లపూడిలో హిమాగ్ని అపార్ట్​మెంటు ఉంది. దానిలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు అని మాకు కాల్ రాగానే నేను, మా ఎస్సై, క్లూస్ టీమ్​ను తీసుకొని ఘటనా స్థలానికి వెళ్లడం జరిగింది. అక్కడ ఒక ఇంట్లో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉరి వేసుకొని చనిపోయినట్లు, ఒకావిడ మంచం మీద చనిపోయి ఉండటాన్ని చూడటం జరిగింది. దీనిపై వాళ్ల బంధువులు అందరినీ అడిగి విచారణ చేస్తున్నాం. మృతదేహాలను ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రాథమిక వివరాల ప్రకారం భార్యాభర్తలకు సంతానం లేదు. అత్త, కొడుకు, కోడలు ముగ్గురూ ఒకే ఇంట్లో చనిపోయారు. మృతికి గల కారణాలు తెలియలేదు". - ఉమర్‌, భవానీపురం సీఐ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.