ETV Bharat / state

YSR University: పేరు మార్చినా.. వైఎస్సార్​ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా గుర్తించని ఎన్ఎంసీ - నేటి ముఖ్య వార్తలు

YSR Health University : వైసీపీ ప్రభుత్వం గత కొద్ది నెలల క్రితం విజయవాడలోని ఎన్టీఆర్​ ఆరోగ్య విశ్వవిద్యాలయ పేరులో మార్పులు చేసినా.. జాతీయ వైద్య కమిషన్​ ఆ మార్పును ఇంకా గుర్తించలేదు. మరోవైపు రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల గుర్తింపును ప్రభుత్వం మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలకు పొడిగించింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 23, 2023, 3:32 PM IST

NTR Health University: విజయవాడలోని ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును వైసీపీ ప్రభుత్వం మార్చినా.. ఆ మార్పును జాతీయ వైద్య కమిషన్‌ ఇంకా గుర్తించలేదు. ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరును రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా కొద్ది నెలల కిందట మార్చింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరును తొలగించి.. వైఎస్సార్​ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా వైసీపీ ప్రభుత్వం మార్పు చేసింది. అయితే నంద్యాలలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో.. ఎంబీబీఎస్​ అడ్మిషన్ల కోసం ఎన్​ఎంసీ జారీ చేసిన లేఖ ద్వారా, పేరు మార్పును ఎన్​ఎంసీ గుర్తించలేదని తేట తెల్లమవుతోంది.

నంద్యాల జిల్లాలో నూతనంగా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కాగా.. ఇందులో 2023-24 విద్యా సంవత్సరం నుంచి 150 సీట్లతో ఎంబీబీఎస్​ తరగతుల ప్రారంభానికి జాతీయ వైద్య కమిషన్​ ఆమోదం తెలిపింది. ఈ మేరకు లేటర్​ ఆఫ్​ పర్మిషన్​ను జారీ చేసింది. ఈ లేఖలో నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలో ఉందని ఎన్​ఎంసీ పేర్కొంది. ఈ లేఖను కళాశాల ప్రిన్సిపల్‌ను ఉద్దేశించి.. విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయానికి పంపించింది.

నంద్యాల నూతన కళాశాలలోని మౌలిక వసతులు, ల్యాబ్​లు, బోధన సిబ్బంది, విద్యార్థుల వసతి గృహాలు.. ఇలా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే ఈ విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్​ కోర్సులకు అనుమతి ఇస్తున్నట్లు ఎన్​ఎంసీ లేఖలో తెలిపింది. ప్రారంభానికి ఎన్​ఎంసీ ఆమోదం తెలుపుతూ.. లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ను జారీ చేసింది.

పాఠశాలల గుర్తింపు పది సంవత్సరాలకు పొడిగింపు : మరోవైపు రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల గుర్తింపును గడువును మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలకు పొడిగిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు తగిన విధంగా విద్యాహక్కు చట్టం నిబంధనలను సవరించింది. ప్రైవేటు పాఠశాలల యజమానులతో పాటు.. ఇటీవల ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన ఎంవీ రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిలతోపాటు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఇచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం. గుర్తింపు గడువును మూడు నుంచి పది సంవత్సరాలకు పొడిగించాలని ఎమ్మెల్సీలు ఇచ్చిన వినతి మేరకు 8 ఏళ్లకు పొడిగించినట్లు వెల్లడించింది.

ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఏటా యాజమాన్యాలు స్వీయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించాల్సి ఉంటుంది. అందులో ఆడిట్‌, శానిటరీ, అగ్నిమాపక, తనిఖీల నివేదికలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలి. అప్​లోడ్​ చేసిన తనిఖీలలో ఏదైనా పాఠశాలలో మూడేళ్లు వరసగా 20 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత ఉంటే ఆ పాఠశాలను మూసివేయాలి. ఒక పాఠశాల ఐదు సంవత్సరాలు వరసగా మూసేసి ఉంటే దాన్ని పునఃప్రారంభించేందుకు కొత్తగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్‌, ఆడిట్‌ నివేదికలను సెప్టెంబరు 30లోపు సంబంధిత అధికారులకు ప్రతి పాఠశాల తప్పనిసరిగా సమర్పించాలి. ఆరు మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న పాఠశాల భవనాలకు మాత్రమే అగ్నిమాపక శాఖ అనుమతులు కావాలి. అంతే తప్పా తక్కువ ఎత్తులో ఉన్న వాటికి అనుమతులు అవసరం లేదు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా బోధన సిబ్బందిని పాఠశాల యాజమాన్యం నియమించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.