The Government Is On Alert Regarding Covid : కొవిడ్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ అన్నారు. కరోనా కేసులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నవంబర్ నుంచి సుమారు 30 వేల శ్యాంపిళ్లు టెస్ట్ చేయగా 130 పాజిటివ్ కేసులొచ్చాయన్నారు. ఇప్పటి వరకు ఒమిక్రాన్ తప్ప కొత్త వేరియంట్లేవీ నమోదు కాలేదన్నారు. జినోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాట్లు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబ్ లు అందుబాటులో వున్నాయని కమీషనర్ జె.నివాస్ అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసియు బెడ్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు, మందులను అందుబాటులో ఉంచామని, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో కరోనా అనుమానిత కేసులపై నిరంతర పర్యవేక్షణ వుంటుందని కమీషనర్ జె.నివాస్ అన్నారు.
ఇవీ చదవండి