ETV Bharat / state

సంతోష్‌కు మరో నోటీసు జారీ చేయండి.. సిట్‌ను ఆదేశించిన హైకోర్టు - BL Santhosh absence for sit investigation

High Court on MLAs Purchase Case: సిట్‌ విచారణకు బీఎల్ సంతోష్ గైర్హాజరు​పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. బీఎల్ సంతోష్ సిట్ ముందు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయాలన్న ఏజీ నిర్ణయంతో ఏకీభవించిన ధర్మాసనం.. సంతోష్‌కు మరో నోటీసు జారీ చేయాలని సిట్​ను ఆదేశించింది.

High Court on MLAs Purchase Case
High Court on MLAs Purchase Case
author img

By

Published : Nov 23, 2022, 4:47 PM IST

High Court on MLAs Purchase Case: సిట్‌ విచారణకు బీఎల్ సంతోష్ గైర్హాజరు​పై హైకోర్టు విచారణ చేపట్టింది. సంతోష్ సిట్ ముందు హాజరయ్యేలా ఆదేశించాలని ఏజీ కోర్టును కోరారు. ఈనెల 20న సంతోష్​కు నోటీసులు అందినా హాజరుకాలేదని తెలిపారు. సంతోష్ విచారణకు వచ్చేలా చూసే బాధ్యత పిటిషనర్‌పై ఉందని ధర్మాసనం పేర్కొంది. నిర్దిష్ట తేదీతో మరో 41ఏ సీఆర్​పీసీ నోటీసు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఏజీ న్యాయస్థానాన్ని కోరారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. సంతోష్‌కు మరో నోటీసు జారీ చేయాలని సిట్​ను ఆదేశించింది. సంతోష్​ ఈ మెయిల్ ఐడీకి నోటీసులు జారీ చేయాలని తెలిపింది. అన్ని వివరాలతో ఈ నెల 29న కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. తదుపరి విచారణను 30న చేపడతామని హైకోర్టు వెల్లడించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.