ETV Bharat / state

దళితుల సంక్షేమంపై చర్చకు సిద్ధమా ? - వైసీపీకి టీడీపీ సవాల్​

TDP SC cell Leaders fired on CM Jagan: దళితుల ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం నినాదంతో ముందుకు సాగాలని టీడీపీ ఎస్సీ సెల్ నేతలు పేర్కొన్నారు. అరాచక పాలనలో దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యాకాండపై ప్రతిఘటనా పోరాటానికి ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సీబీఎన్ ఫోరం - కేశినేని శివనాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన దళిత గళం కార్యక్రమంలో పిలుపునిచ్చారు.

TDP SC cell Leaders fired on CM Jagan
TDP SC cell Leaders fired on CM Jagan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2023, 3:59 PM IST

TDP SC Cell Leaders Fire on CM Jagan: ఏం చేసినా జగన్ ఉన్నాడనే కండకావరంతో కొంతమంది దళితులపై దురాగతాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం ఎస్సీ సెల్ నేతలు ధ్వజమెత్తారు. జగన్ దళితులకు ఏం చేశాడో చెప్పే దమ్ముందా అంటూ విమర్శలు గుప్పించారు. దళితులకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం గురించి చర్చకు రావాలని వారు సవాల్ చేశారు.

హత్యాకాండపై ప్రతిఘటనా పోరాటాలు: ఎన్టీఆర్ జిల్లా - నందిగామలో సిబిఎన్ ఫోరం కేశినేని శివనాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత గళం రాష్ట్రస్థాయి సదస్సుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు దళితుల ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అరాచక పాలనలో దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యాకాండపై ప్రతిఘటనా పోరాటాలు చేసే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. బాబు జగ్జీనవ్​ రావ్, అంబేడ్కర్ విగ్రహాలకు తెలుగుదేశం నేతలు నివాళులర్పించారు.

దళితుల సంక్షేమంపై చర్చకు సిద్ధమా ? - వైసీపీకి టీడీపీ సవాల్​

సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్‌ - తోసిపుచ్చిన డివిజన్‌ బెంచ్‌

కల్తీ మద్యం కారణంగా దళిత కుటుంబాలు: వంగలపూడి అనిత మాట్లాడుతూ కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్​కు మతిస్థిమితం లేని ముద్ర వేసి ఆయన మృతికి కారణమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో దళిత మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఎవరి హయాంలో దళితులకు మేలు జరిగిందో, ప్రజలు కూడా ఆలోచన చేయాలని కోరారు. ఈ సైకో పాలనను తరిమి కొట్టే విధంగా ప్రజలంతా సంఘటితం కావాలని నేతలు పిలుపునిచ్చారు. జగన్ సొంత బ్రాండ్లు, కల్తీ మద్యం కారణంగా దళిత కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే మహిళలకు భద్రత ఉంటుందని అన్ని రకాలుగా ప్రయోజనం జరుగుతుందని అనిత తెలిపారు.

విశాఖలో దారుణం..డాక్టర్​ను కట్టేసి పోలీస్​స్టేషన్​కు తరలింపు

దళితులపై దాడులుకు తెగబడి: నందిగామలో సీబీయన్ ఫోరమ్ ఆధ్వర్యంలో దళిత గళం సభను తెలుగుదేశం నేతలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళిత పథకాలు ఎన్నింటినో రద్దు చేశారని నేతలు ఆరోపించారు. దళితులపై దాడులుకు తెగబడి, వారి మరణాలకు కారణమయ్యాడని దుయ్యబట్టారు. దళిత అమ్మాయిలను కూడా వదలకుండా వారి జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ సీఎం అయ్యాక దళితులకు ఏ విధంగా సాయం అందించారో సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తన కోసమే పాలన చేస్తున్నాడని దుయ్యబట్టారు. అక్రమార్జన కేసులో నమోదైన సీబీఐ, ఈడి కేసుల్లో విచారణ తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎం పదవి పోతే జగన్మోహన్ రెడ్డి జైలుకే వెళతాడు కాబట్టి పదవి కోసం ఎన్ని పనులైనా చేస్తాడని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.

కుర్చీ వేయరు, నిధులు ఇవ్వరు - దళిత సర్పంచ్​కు అవమానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.