TDP MLCs COMPLAINT TO EC : వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీలు దుయ్యబట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నిర్వహించిన ఓటరు నమోదులో అక్రమాలు తలెత్తాయని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ ఓటరు నమోదు కార్యక్రమంలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్సీలు ఆరోపించారు. ప్రభుత్వం అడ్డగోలుగా వాలంటీర్లు, ఏపీఎంవోల చేత గంపగుత్తగా, నిబంధనలకు వ్యతిరేకంగా.. ఓటర్ నమోదు చేయించిందని అన్నారు. చివరి రోజు గంపగుత్తగా వచ్చిన ఓటరు దరఖాస్తులను పునపరిశీలించి.. దొంగ ఓట్లు తొలగించాలని కోరారు. అలాగే ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తుల పునఃపరిశీలన సక్రమంగా నిర్వహించి.. భోగస్, నకిలీ ఓట్లను తొలగించాలని కోరారు. ఈ అక్రమాలలో జరిగిన అన్యాయంపై, న్యాయం కోసం ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇవీ చదవండి: