Lokesh is letter to CM Jagan: చట్టవిరుద్ద నిబంధనలు, నోటీసులతో వైసీపీ ప్రభుత్వం పింఛన్లు తొలగించటం నిలిపివేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ డిమాండ్ చేశారు. పింఛను నయవంచన తగదంటూ.. ముఖ్యమంత్రికి లోకేశ్ లేఖ రాశారు. అధికార పీఠం ఎక్కేందుకు.. పింఛన్ల పెంపు పేరుతో ఇచ్చిన హామీలు మరిచిపోయారా అని ఆక్షేపించారు. గద్దె ఎక్కిన నుంచి.. పింఛన్ల నయవంచనకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.
తెలుగుదేశం ప్రభుత్వం 200 రూపాయలుగా ఉన్న పింఛను.. 2వేలుకు పెంచిందని గుర్తు చేశారు. వైసీపీ పార్టీ పింఛన్లను 3000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చి.. మోసగించారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వయోపరిమితి నిబంధనలతో.. సుమారు 18.75 లక్షల పింఛన్లను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది పింఛన్లను రద్దు చేయాలనుకోవడం చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
20 ఏళ్ల నుంచి పింఛన్లు పొందుతున్న దివ్యాంగులు, వితంతువుల ఆసరాను తొలగించి.. వారి ఉసురు తీయొద్దని వేడుకున్న గోడు.. ప్రభుత్వానికి వినిపించడం లేదా అని మండిపడ్డారు. నిరుపేదలకు లేని కారు, పొలం, ఇల్లు, ఆస్తులు ఎలా సృష్టిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. ముఖ్యమంత్రి మానవత్వంతో ఆలోచించాలని హితవు పలికారు. అవ్వాతాతల జీవితాలకు వెలుగునిచ్చే చిరుదీపాన్ని ఆర్పే ప్రయత్నం చేయొద్దని కోరారు. దివ్యాంగులకు ఆసరాగా నిలిచిన పింఛన్లను లాక్కోవద్దన్నారు. వితంతువుల జీవనానికి చేదోడు అయిన పింఛను కోతతో.. వారికి గుండెకోత మిగల్చవద్దని విన్నపించారు.
-
పింఛను నయవంచన తగదు అంటూ సిఎం జగన్ రెడ్డి గారికి లేఖ రాసాను. అధికార పీఠం ఎక్కేందుకు పింఛన్ల పెంపు పేరుతో అవ్వాతాతలు, అనాథలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు మీరు ఇచ్చిన హామీలు మరిచిపోయారా? గద్దె ఎక్కిన నుంచీ పింఛన్ల నయవంచనకి దిగారు.(1/3) pic.twitter.com/oImReSreXW
— Lokesh Nara (@naralokesh) December 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">పింఛను నయవంచన తగదు అంటూ సిఎం జగన్ రెడ్డి గారికి లేఖ రాసాను. అధికార పీఠం ఎక్కేందుకు పింఛన్ల పెంపు పేరుతో అవ్వాతాతలు, అనాథలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు మీరు ఇచ్చిన హామీలు మరిచిపోయారా? గద్దె ఎక్కిన నుంచీ పింఛన్ల నయవంచనకి దిగారు.(1/3) pic.twitter.com/oImReSreXW
— Lokesh Nara (@naralokesh) December 28, 2022పింఛను నయవంచన తగదు అంటూ సిఎం జగన్ రెడ్డి గారికి లేఖ రాసాను. అధికార పీఠం ఎక్కేందుకు పింఛన్ల పెంపు పేరుతో అవ్వాతాతలు, అనాథలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు మీరు ఇచ్చిన హామీలు మరిచిపోయారా? గద్దె ఎక్కిన నుంచీ పింఛన్ల నయవంచనకి దిగారు.(1/3) pic.twitter.com/oImReSreXW
— Lokesh Nara (@naralokesh) December 28, 2022
ఇవీ చదవండి: