ETV Bharat / state

కందుకూరు ఘటన.. ఏక సభ్య కమిషన్ విచారణకు హాజరుకానున్న టీడీపీ నేతలు - టీడీపీ అధినేత చంద్రబాబు

KANDUKURU INCIDENT UPDATES: కందుకూరు తొక్కిసలాట ఘటనపై.. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి కమిషన్ విచారణ నేడు జరగనుంది. కందుకూరు తెలుగుదేశం నేతలు ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్‌లను కమిషన్‌ విచారణకు పిలిచింది.

KANDUKURU INCIDENT
KANDUKURU INCIDENT
author img

By

Published : Feb 7, 2023, 8:48 AM IST

KANDUKURU INCIDENT UPDATES : 2022 డిసెంబర్​ 28న టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన బహిరంగసభలో ఎనిమిది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి కమిషన్ విచారణ చేపట్టింది. ఈమేరకు కందుకూరు తెలుగుదేశం నేతలు ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేశ్​లను కమిషన్​ విచారణకు పిలిచింది. ఈరోజు ఉదయం 11గం.కు విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహంలో విచారణకు రావాలని నేతలకు నోటీసులు జారీచేసింది. దీంతో కమిషన్ ముందు నేతలు విచారణకు హాజరు కానున్నారు.

సంబంధిత కథనం: కందుకూరు ఘటన.. విశ్రాంత న్యాయమూర్తితో కూడిన ఏక సభ్య కమిటీ పరిశీలన

ఇప్పటికే గుంటూరు తొక్కిసలాట ఘటనపై ఏక సభ్య కమిషన్ విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ప్రభుత్వానికి జస్టిస్ శేషశయనారెడ్డి కమిషన్ నివేదిక సమర్పించనుంది. జీవో నెంబర్-1ను రద్దు చేయాలనే డిమాండ్లు వస్తోన్న క్రమంలో జస్టిస్ శేషశయనారెడ్డి కమిషన్ ఇచ్చే నివేదిక కీలకమని ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం.

కందుకూరులో అసలేం జరిగింది: 2022 డిసెంబర్​ 28న నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గర టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ వద్దకు చంద్రబాబు రాత్రి 7:30 గంటలకు చేరుకున్నారు. అప్పటికే భారీగా జనం రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. చంద్రబాబు వాహనం వెంట కూడా జనం పెద్దఎత్తున రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.

ఈ క్రమంలో అక్కడున్న ద్విచక్రవాహనాలపై కొందరు పడిపోగా.. వారిపై మరికొందరు పడ్డారు. అప్రమత్తమైన టీడీపీ నేతలు గాయపడిన కార్యకర్తలను వెంటనే ఆసుపత్రికి తరలించారు.. వైద్యులు వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. చంద్రబాబు ప్రసంగం ప్రారంభం నుంచి కార్యకర్తలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ప్రమాదకరంగా ఫ్లెక్సీలపై ఎక్కిన వారిని ఆయన మందలించారు. సభ విజయవంతంగా నిర్వహించుకునేందుకు సహకరించాలని కోరారు.

పోలీసులు సహకరించి కార్యకర్తలను నియంత్రించాలని కోరారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగిన విషయాన్ని గుర్తించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి పరిస్థితి తెలుసుకునే వరకు సభను నిలిపివేశారు. వెంటనే బాధితుల్ని తరలించిన ఆసుపత్రికి వెళ్లారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.