ETV Bharat / state

వైసీపీ నేతల వేధింపులతో మృతి చెందిన చోటీ కుటుంబానికి టీడీపీ నేతల ఆర్ధిక సాయం - ఎన్టీఆర్ జిల్లా లేటెస్ట్ న్యూస్

విజయవాడలో వైసీపీ నేతల వేధింపులకు గురై మృతి చెందిన ముస్లీం మహిళ చోటి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం నాయకులు రూ. లక్ష ఆర్థిక సహాయం చేశారు. దీంతోపాటు వైసీపీ నాయకుల కుట్రలతో ఉద్యోగం కోల్పోయిన కొమిరి దుర్గ అనే మహిళకు ఇచ్చిన హామీ మేరకు ప్రతినెల రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని వారు ప్రకటించారు.

వైకాపా బాధితులకు తెదేపా నాయకుల ఆర్థిక సాయం

author img

By

Published : Mar 12, 2023, 8:04 PM IST

విజయవాడ రాణిగారితోటలో ఇటీవల వైసీపీ నేతల వేధింపులకు గురై మృతి చెందిన ముస్లీం మహిళ చోటి కుటుంబానికి తెలుగుదేశం నేతలు ఆర్థిక సాయం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్‌, టీడీపీ సీనియర్‌ నేత నాగుల్‌ మీరా లు బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఇదే వివాదంలో వైసీపీ నేతల కుట్రలతో ఉద్యోగం కోల్పోయిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన కొమిరి దుర్గకు ప్రతినెల రూ.10వేలు చెల్లిస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఆ ఆర్ధిక సాయాన్ని కూడా తెదేపా తూర్పు నియోజక వర్గం నాయకులంతా కలిసి వారి సొంత నిధుల నుంచి దుర్గకు రూ. 10 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ నేతలు వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు ప్రజల మధ్య పర్యటిస్తున్నప్పుడు ప్రజలు మరింత గట్టిగా సమస్యలు చెబుతుంటారు? ప్రజల సమస్యలు వినే ఓపిక కూడా లేని అవినాష్ ఏ విధంగా ప్రజా ప్రతినిధి అవ్వగలడు? అని నాగుల్ మీరా ప్రశ్నించారు. రౌడీయిజం, గుండాయిజం చేసే నాయకులను విజయవాడ తూర్పు ప్రజలు గెలిపించరని, అందుకే శాంతిభద్రతలు, ప్రశాంత వాతావరణం కల్పించే గద్దె రామమోహన్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని నాగుల్‌ మీరా అన్నారు. ప్రజలకు తగిన విధంగా నాయకుడు ఉండాలే గాని, బెదిరింపులతో ప్రజలను ఏమార్చాలనుకోవడం వైకాపా నాయకుల అవివేకమని తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ లో గత 15 ఏళ్లుగా ఎటువంటి రౌడీయిజాలు లేవని, కొత్తగా గత 2 సంవత్సరాల నుంచి అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు.

గతంలో రాజకీయాలంటే కేవలం ఎన్నికల సమయంలోనే ఉండేవని, కానీ జగన్ తన స్వార్థం కోసం విద్వేషాలు, రౌడీయిజాలతో రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్నారని ధ్వజమెత్తారు. జనవరి నెలలో విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో కృష్ణలంక తారక రామ నగర్‌లో మైనార్టీ మహిళపై వైకాపా నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. వైకాపా నియోజకవర్గ ఇన్​ఛార్జి దేవినేని అవినాష్‌ గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికి తిరుగుతున్న సమయంలో మైనార్టీ మహిళ రమీజా ఆయనను ప్రశ్నించింది. దీంతో మరుసటి రోజు వైకాపా మహిళా నాయకులు.. ఆమె ఇంటిపై దాడి చేశారు. అధికారుల నుంచి వరస వేధింపులు ఎదురవ్వడంతో రమీజా సోదరి చోటీ గుండెపోటుతో మృతి చెందింది.

"మూడు సంవత్సరాల నుంచి ఫెన్షన్ రావట్లేదని ఎంతో ఆవేదనతో తన బాధను చెప్పుకున్న ముస్లీం మహిళపై మరుసటి రోజు కారంతో, రాళ్లతో దాడి చేశారు. ఇలా ఆమె బాధను అర్థం చేసుకునే స్థితిలో లేని వైసీపీ నాయకులు ఇలాంటి పరిస్థితులను కల్పించారు. ఇలాంటి దౌర్జన్య కాండాలను వ్యతిరేకిస్తూ తెదేపా నాయకులమంతా కలిసి ఆ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాము. అదే విధంగా వైకాపా నాయకులు కుట్రతో దుర్గ అనే మహిళను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమెకు ఇప్పుడు మేము రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించాము. ఆమెకు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతినెల ఆమెకు ఇలానే ఆర్థిక సహాయం చేస్తాం. అంతేకాక దుర్గకు ఉద్యోగం వచ్చేంత వరకు మేము పోరాడతాం."

- గద్దె రామ్మోహన్‌, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.