Devineni Uma : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నుంచి మరోసారి పోటీ చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు జంకుతున్నారని.. తెలుగుదేశం నేత దేవినేని ఉమ అన్నారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై.. ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ ఓ మహిళను కించపరిచేలా మాట్లాడుతుంటే.. ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని దేవినేని ఉమ ప్రశ్నించారు. నందిగామలో ఇటీవల చంద్రబాబు రోడ్‌షో విజయవంతం కావడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిద్రపట్టడం లేదని.. అందుకే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ నియోజకవర్గంలో భారీగా మట్టి, ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఇవన్నీవైఎస్సార్సీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగుతున్నాయని ఆరోపించారు. గంజాయి, నాసిరకం మద్యం, లాటరీ టిక్కెట్ల, డ్రగ్స్ విక్రయాలను నేతల అనుచరులే నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
"ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తప్పు చేస్తున్నాడు. తప్పు మాట్లాడాడు మహిళ అనే గౌరవం లేకుండా, శాసన సభ్యురాలుగా పనిచేసిన మహిళపై ఎమ్మెల్సీ ఇలా మాట్లాడుతుంటే ఎమ్మెల్యే ఖండించకూడదా. ఆమెపై, ఆమె కుటుంబసభ్యులపై చేసిన ఆరోపణలన్ని ఖండిస్తున్నాము. టీడీపీ నాయకులం అందరం పూర్తిగా తంగిరాల సౌమ్యకు అండగా ఉంటాం." -దేవినేని ఉమ, టీడీపీ నేత
ఇవీ చదవండి :