ETV Bharat / state

ఉమ్మడి మేనిఫెస్టో, 100 రోజుల ప్రణాళిక దిశగా టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం - TDP Janasena 2nd coordination committee updates

TDP-Janasena 2nd coordination committee Updates: తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ రెండో సమావేశం విజయవాడలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో పూర్తిస్థాయి ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, 100 రోజుల ప్రణాళిక, ఓటరు జాబితాలో అవకతవకలపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది.

TDP_Janasena_2nd_coordination_committee
TDp_Janasena_2nd_coordination_committee
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 12:54 PM IST

Updated : Nov 9, 2023, 1:32 PM IST

TDP-Janasena 2nd coordination committee Updates: తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ రెండో సమావేశం విజయవాడలో గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ రెండో సమావేశానికి టీడీపీ తరఫున.. నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్యగా హాజరవ్వగా.. జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పాలవలస యశస్వి, బొమ్మిడి నాయికర్, మహేందర్‌ రెడ్డి, కొటికలపూడి గోవిందరావు పాల్గొన్నారు. నేటి సమావేశంలో ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన, 100 రోజుల ప్రణాళిక, ఓటరు జాబితా అవకతవకలపై ఇరు పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.

TDP-Janasena Second meeting at Vijayawada: ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటానికి తెలుగుదేశం, జనసేన పార్టీలు సిద్దమయ్యాయి. 100 రోజుల ప్రణాళిక ఖరారుకు కసరత్తు మొదలుపెట్టాయి. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండాగా రెండు పార్టీలు రెండో సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నాయి. విజయవాడలో ప్రారంభమైన రెండో సమావేశంలో.. మేనిఫెస్టో ప్రకటన లోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఓ కరపత్రం రూపకల్పనకు పూనుకున్నాయి. దీంతో పాటు ఓటర్ జాబితా అవకతవకలు పైనా ఉమ్మడి పోరు ప్రణాళికను ఇరుపార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు పార్టీలు ఉమ్మడి జిల్లాల స్థాయిలో ఆత్మీయ సమావేశాల్ని పూర్తి చేసుకునందున్న, రానున్న రోజుల్లో నియోజకవర్గాల స్థాయిలోను ఆత్మీయ సమావేశాల నిర్వహణపై నేటి భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.

Pawan Announced TDP Janasena Alliance : వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసే పోటీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్

TDP-Janasena First Meeting on October 23: టీడీపీ-జనసేన తొలి సమన్వయ కమిటీ విషయానికొస్తే.. అక్టోబర్‌ 23వ తేదీన నారా లోకేశ్, పవన్ కల్యాణ్ అధ్యక్షతన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తొలి భేటీ జరిగింది. ఆ భేటీలో.. ప్రధానంగా 6 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు రెండున్నర గంటల పాటు తొలి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలు, అవినీతిపై ఛార్జిషీట్‌, ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాట ప్రణాళికపై సమన్వయ కమిటీలో చర్చించారు. దాంతోపాటు రాజకీయ కార్యక్రమాల వేగం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు.

GVL comments on party alliances: 'పవన్ ఆలోచనను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాం.. త్వరలోనే స్పష్టత'

Exercise on Joint Manifesto Declaration: ఈ నేపథ్యంలో దాని కొనసాగింపుగా గురువారం విజయవాడలో రెండో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండాగా చర్చ జరుగుతోంది. మేనిఫెస్టో ప్రకటనలోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా వెళ్లేందుకు ఓ కరపత్రం రూపొందించనున్నారు. ఆ కరపత్రం రూపకల్పనపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది.

JanaSena Leader Nadendla Manohar Fire on CM Jagan: "విద్య పేరిట సీఎం జగన్ వందల కోట్లు విదేశీ సంస్థలకు దోచిపెడుతున్నారు"

Last Updated : Nov 9, 2023, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.