EX-MLA ARREST: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రాఘవాపురంలో కొండ గట్లను దోచేస్తున్నారని నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను.... పోలీసులు అరెస్టు చేశారు. గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతుందని నిరసిస్తూ అర్ధరాత్రి వరకు కార్యకర్తలతో ఆమె ధర్నా నిర్వహించారు.
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను అక్రమంగా అరెస్టు చేయడంపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇష్టానుసారంగా గుట్ట గ్రామంలో అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ పట్టించుకోని పోలీసులు.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను ఎందుకు అరెస్టు చేశారని ఆమె ప్రశ్నించారు. గత నాలుగు రోజులుగా అధికారులకు మేము ఫిర్యాదు చేస్తున్న ఏ మాత్రము చర్యలు లేవు.. కానీ ఈరోజు మేము దీక్ష చేస్తుంటే ఏదో తప్పు చేసినట్లుగా అరెస్టులు చేయడం ఏంటని నిలదీశారు.
ఇవీ చదవండి: