Sankranti Celebrations Across AP: రాష్ట్రంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వీధుల్లో రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. భోగిమంటలు, హరిదాసు కీర్తనలు, పొంగళ్లు, రంగవళ్లులు, భోగిపళ్లతో సంబరాలు మన సంస్కృతిని ప్రతిబింభించేలా సాగాయి. పిండివంటల ఘుమఘుమలతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. తెలుగువారి పెద్దపండుగ సంక్రాంతిని గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా నిర్వహించారు. సంక్రాంతికి కోడిపందెం బరులు సిద్ధమవుతున్నాయి.
సంక్రాంతి విశిష్టత ఏమిటి - దీనిని పెద్ద పండుగ అని ఎందుకు అంటారు?
Vijayawada: విజయవాడ కంచికచర్ల మండలం గండేపల్లిలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో పొట్టేళ్ల పందాలు నిర్వహించారు. దీనిని ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ప్రారంభించారు.. అనంతరం గ్రామస్థులతో కలిసి పొట్టేళ్ల పందాలను వీక్షించారు. మచిలీపట్నంలో మల్లయ్య స్వీట్స్ నిర్వాహకులు పండుగ వేళ ప్రజల కోసం ప్రత్యేక పిండి వంటలను సిద్ధం చేశారు.
విజయవాడ వన్‌టౌన్‌లోని కేబీఎన్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. బొమ్మల కొలువు, హరిదాసు గానం, చిన్నారులకు భోగి పళ్లు పోయడం, గంగిరెద్దులు ఆటలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. విద్యార్ధులు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. తెలుగు సంప్రదాయ వంటకాలను విద్యార్ధులే స్వయంగా తయారు చేసి కళాశాల్లో ప్రదర్శించారు. గంగిరెద్దులు ఆటలతో విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. కళాశాల అద్యాపకులు, స్థానికులు చిన్నారులకు భోగి పళ్లు పోశారు. విద్యార్ధినిలు చేసిన కోలటం అందరిని అకట్టుకుంది.
సంక్రాంతి బస్సుల్లేవ్- రయ్ రయ్ మంటున్న బైకులు!
Visakhapatnam: విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఎంపీ జీఎల్‌వీ నరసింహరావు నేతృత్వంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం ఏర్పాటు చేయగా సినీ నటులు, కళాకారులు పాల్గొన్నారు.
Anakapalli District: సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వాహంచారు. మహిళలు పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గురు విజేతలను ఎంపిక చేసి త్వరలోనే బహుమతులను అందజేస్తామని జనసేన నియోజకవర్గం ఇంఛార్జీ పేర్కొన్నారు.
Vizianagaram: విజయనగరం జిల్లా పరిషత్తు కార్యాలయంలో మహిళా ఉద్యోగులు రంగువల్లులతో ఆకట్టుకున్నారు. కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు. విజయనగరం వాజీ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగవల్లుల పోటీలో మహిళలు రంగు రంగుల ముగ్గులను తీర్చిదిద్దారు.
అంబరాన్నంటిన సంక్రాంతి సంబారాలు - నృత్యాలతో సందడి చేసిన మహిళలు
Bapatla District: బాపట్ల జిల్లా పర్చూరులో సంక్రాంతి సందర్భంగా సౌత్ ఇండియా లెవెల్ క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలను పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీ ఆమంచి కృష్ణమోహన్ ప్రారంబించారు. ఈ పోటీల్లో 16 జట్లు పాల్గొన్నాయి. ఝార్ఖండ్, కర్ణాటక, గోవా, తమిళనాడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి జట్లు పాల్గొన్నాయి. అన్నంబొట్లవారిపాలెంలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఈనెల 18వ తేదీ వరకు నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పారు.