ETV Bharat / state

రంగవల్లులు, గంగిరెద్దులు.. ఆటపాటలు..  సంక్రాంతి శోభతో సందడి చేస్తున్న విద్యార్ధులు

SANKRANTHI SAMBARALU: రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా సంక్రాంతి సందడే కనపడుతోంది. ముందస్తు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ముగ్గుల పోటీలు, ఆటపాటలతో యువత సందడి చేస్తోంది.

SANKRANTHI
SANKRANTHI
author img

By

Published : Jan 13, 2023, 10:35 AM IST

Updated : Jan 13, 2023, 11:15 AM IST

SANKRANTHI SAMBARALU: హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు..! ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు..! వేకువజామునే జంగమదేవరల జేగంటలు, ఢమరుక నాదాలు..! అక్కడక్కడా పిట్టలదొరల బడాయి మాటలతో.. పట్టణాలు, పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి.

తెలుగు వంటకాలు, పల్లె వాతావరణాన్ని: విజయనగరం జిల్లాలోని లెండీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు సంక్రాంతి విశిష్ఠత తెలిపేందుకు "సంక్రాంతి సంబరాలు" పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. నోరురూరించే తెలుగు వంటకాలు, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా బొమ్మల కొలవులు ఏర్పాటు చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిన విద్యార్థులు..నృత్యాలు చేసి అలరించారు.

విభిన్న ఆకృతులు, రంగుల్లో ముగ్గులు: విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో స్థానిక వాజీ ఛానల్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. జిల్లా చరిత్రను తెలియచేసేలా మహిళలు విభిన్న ఆకృతులు, రంగుల్లో ముగ్గులను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో బుల్లితెర నటి జ్యోతిరాయ్, విజయనగరం మేయర్ విజయలక్ష్మీ పాల్గొన్నారు.

గోమాతకు పూజ: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులు గోమాతను పూజించారు. ఆటపాటలతో సందడి చేశారు.

క్రికెట్‌ టోర్నమెంట్: పల్నాడు జిల్లా పెదకూరపాడులోని శ్రీ చైతన్య స్కూల్ లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే నంబూరి శంకరరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని అయ్యప్ప స్వామి గుడి సమీపంలో పోలీసుల ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జగన్మోహన్ బ్యాటింగ్ చేసి యువతను ఉత్సాహపరిచారు.

గంగిరెద్దుల విన్యాసాలు: విశాఖపట్నంలోని పాండురంగ పురం బీచ్ రోడ్డులోని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు నివాసం వద్ద సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

ఇవీ చదవండి

Last Updated : Jan 13, 2023, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.