ETV Bharat / state

Illegal Sand Mining: ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్సార్​సీపీ నేతల ఇసుక దందా.. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మరీ..! - ఎన్టీఆర్ జిల్లా లేటెస్ట్ న్యూస్

Illegal Sand Mining: కృష్ణా, మున్నేరు నదుల్లో వైఎస్సార్​సీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. అక్రమార్కుల చర్యలతో పర్యావరణానికి నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్‌ అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 19, 2023, 2:09 PM IST

అక్రమ ఇసుక తవ్వకాలు

Illegal Sand Mining: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని కృష్ణా, మున్నేరు నదుల్లో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా యంత్రాలతో విచ్చలవిడిగా ఇసుకను తవ్వేస్తున్నారు. ప్రతి రోజు నందిగామ ప్రాంతం నుంచి తెలంగాణలోని.. హైదరాబాద్, ఖమ్మం, మధిర ప్రాంతాలకు లారీలు,టిప్పర్లలో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. కనీసం వీరి వద్ద ఎటువంటి రసీదులు కూడా ఉండట్లేదు. కంచికచర్ల మండలం కేసర వద్ద కృష్ణానది నుంచి చందర్లపాడు, కంచికచర్ల మండలాల నుంచి క్వారీల్లో ఇసుక భారీగా తీసుకొచ్చి డంపింగ్ చేస్తున్నారు. దాదాపు 100 మీటర్ల ఎత్తులో ఇసుక నిల్వ చేస్తున్నారు.

ఇసుక తవ్వకాలు చేసేందుకు భారీ యంత్రాలను వాడుతున్నారు. ఇక నందిగామ మండలం పల్లగిరి వద్ద భారీ ఇసుక డంప్ ఏర్పాటు చేశారు. నందిగామ, మాగల్లు గ్రామాల పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. మున్నేరు నదిలో ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. యంత్రాలతో దాదాపు 15 అడుగుల లోతులో ఇసుక తీస్తున్నారు. నీళ్లు తగిలే వరకు ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. నందిగామ రక్షిత మంచినీటి పథకాల బోర్లు ఉన్నచోటే యంత్రాలతో ఇసుక తరలిస్తున్నారు. దీంతో తాగునీటి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి నెలకొంది.

క్వారీలకు వద్ద ఎటువంటి హద్దులు లేకపోవడంతో ఇష్టానుసారం తవ్వకాలు సాగిస్తున్నారు. మున్నేర్​లో నందిగామ, మాగల్లు వద్ద క్వారీలు ఉంటే అనుమతికి మించి శనగపాడు గ్రామం వరకు వెళ్లి అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. కొంతకాలంగా అక్రమ తవ్వకాలతో ఇసుక తరలిస్తున్న తరలించడం వల్ల పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఇసుక కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇదేవిధంగా కృష్ణా నదిలోనూ చందర్లపాడు, కంచికచర్ల మండలాల్లోని పలు క్వారీల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

విచ్చలవిడి ఇసుక తవ్వకాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. నిత్యం వందల సంఖ్యలో లారీలను తెలంగాణ ప్రాంతాలకు పంపుతూ అక్రమంగా సంపాదన ఆర్జిస్తున్నారని మండిపడ్డారు. అక్రమార్కుల చర్యలతో పర్యావరణ నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీస్ రెవెన్యూ, మైనింగ్ ఎస్సీబీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనంలేదని వాపోయారు. ఇప్పటికైనా దీనిపై మైనింగ్‌ అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

"ఈ ప్రాంతంలో వైఎస్సార్​సీపీ నాయకులు విచ్చలవిడి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ భారీ యంత్రాలతో ఇసుక తవ్వేస్తున్నారు. ప్రతి రోజు వందల సంఖ్యలో లారీలను తెలంగాణ ప్రాంతాలకు పంపుతూ అక్రమంగా సంపాదన ఆర్జిస్తున్నారు. క్రమార్కుల చర్యలతో పర్యావరణ నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికైనా దీనిపై మైనింగ్‌ అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుకుంటున్నాము." - స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.