ETV Bharat / state

బీభత్సం సృష్టించిన టిప్పర్​.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

author img

By

Published : Dec 26, 2022, 10:47 AM IST

Gachibowli Road Accident Today : తెలంగాణ రాష్ట్రంలోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న నాలుగు కార్లు, 2 బైకుల మీదకు ఓ టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు.

tipper accident
బీభత్సం సృష్టించిన టిప్పర్

Gachibowli Road Accident Today : హైదరాబాద్​ గచ్చిబౌలిలోని విప్రో కూడలి వద్ద ఓ టిప్పర్‌ వాహనం బీభత్సం సృష్టించింది. సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న 4 కార్లు, 2 బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఘటనా స్థలంలోనే స్విగ్గీ డెలివరీ బాయ్‌ నసీర్‌ మృతి చెందాడు. అబ్దుల్‌ అనే విద్యార్థికి కాలు విరిగడంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బ్రేకులు ఫెయిల్‌ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.