Inappropriate comments on Ayyappa Swamy: తెలంగాణ రాష్ట్ర కొడంగల్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో భారత్ నాస్తిక్ సమాజ్ తెలంగాణ అధ్యక్షుడు బైరి నరేష్ అయ్యప్ప స్వామిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను అయ్యప్పమాలధారులు తీవ్రంగా వ్యతిరేకించారు. అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జగ్గయ్యపేట ఎన్టీఆర్ కూడలి వద్ద పెద్దసంఖ్యలో దీక్షా స్వాములు ఆందోళన చేపట్టారు. స్వామియే శరణమయ్యప్పా అంటూ నినాదాలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామి జన్మను కించపరిచే విధంగా బైరి నరేష్ మాట్లాడటంతో.... కర్నూలులో స్వామి మాలధారులు నిరసన చేపట్టారు. అతని వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. భక్తులు రోడ్ల పైకి వచ్చి నిరసన తెలిపారు.
బాపట్ల జిల్లాలో అయ్యప్ప స్వాములు నిరసనలు వ్యక్తం చేశారు.. చీరాలలో ఆంజనేయ సేవాసమితి, అయ్యప్పస్వాములు ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు... చీరాల శివాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నరేష్‌ను అరెస్టు చేయాలని, అతనిపై అతనిపై పీడి యాక్ట్ నమోదు చేయాలని, అతని అనుచరులపై సైతం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గడియారస్తంభం కూడలిలో డిమాండ్ చేశారు. అనంతరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ర్యాలీలో చీరాల పేరాల అయ్యప్ప స్వాములు, క్షీరపురి హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ,చీరాల శివాలయం కమిటీ సభ్యులు విశ్వహిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.
అయప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నంద్యాలలోని గాంధీ చౌక్ లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో హిందూ దేవుళ్లను అవమానించడం తగదంటూ నినాదాలు చేశారు.
ఇవీ చదవండి: