ETV Bharat / state

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. ప్రచార జోరులో ప్రధాన రాజకీయ పార్టీలు

Graduate MLC Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాని ముమ్మరం చేశాయి. అబివృద్ధికి పట్టం కట్టాలంటే మాకే ఓటేయాలని ఓ పార్టీ. ప్రజావ్యతిరేకతకు భయపడి దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారని మరో పార్టీ. ఇలా హామీలు, ఆరోపణల మధ్య ప్రచార జోరు పెరిగింది.

Graduate MLC Elections
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక
author img

By

Published : Mar 8, 2023, 9:42 AM IST

Political Parties AP : ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. పట్టభద్రులు, ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతకు భయపడి వైఎస్సార్​సీపీ భారీగా దొంగ ఓట్లు నమోదు చేయించిందని తెలుగుదేశం ఆరోపించింది. సంక్షేమం చూసి ఓట్లు వేయాలని వైఎస్సార్​సీపీ, అభివృద్ధి కావాలంటే బీజేపీకే పట్టం కట్టాలని.. కమలం నేతలు ప్రచారం ముమ్మరం చేశారు.

పట్టభద్రులు, ఉపాధ్యాయ, ఎమ్మెల్సీ ఎన్నికలకు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తానన్న సీఎం జగన్​.. తర్వాత మాట తప్పారని ఉత్తరాంధ్ర పట్టుభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్ధి వేపాడ చిరంజీవిరావు మండిపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరంలో టీడీపీ నేతలు అశోక్ గజపతిరాజు, కూన రవికుమార్‌తో కలిసి ప్రచారం పాల్గొన్న ఆయన.. ఎన్నికల్లో గెలిపిస్తే యువత, ఉద్యోగుల తరపున పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.

"అందరి నుంచి మంచి స్పందన వస్తోంది. అన్ని వర్గాలవారు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తిని వారు ప్రభుత్వానికి తెలియజేయాలని సంసిద్ధులై ఉన్నారు." -వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్ధి

ఎమ్మెల్సీ ఎన్నికలను సార్వత్రిక పోరుకు సెమీఫైనల్స్‌గా భావించి.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల వైఎస్సార్​సీపీ అభ్యర్థిని గెలిపించాలని విశాఖలో ఉత్తరాంధ్ర వైఎస్సార్​సీపీ ఇంఛార్జ్​ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సంక్షేమంతో పాటు బీసీలకు అండగా నిలుస్తున్న వైఎస్సార్​సీపీని గెలిపించాలని రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య కోరారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని 60 శాతం వరకు పెంచిన ఘనత జగన్​మోహన్​ రెడ్డికి దక్కిందని అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర బాగుపడాలంటే బీజేపీ అభ్యర్ధి మాధవ్‌ను గెలిపించాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు.

"రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలీస్తే ఇక్కడ దారుణంగా ఉంది. ఉపాధి అవకాశాలు లేవు. లక్షల సంఖ్యలో బయటకు లక్షల సంఖ్యలో వెళ్తున్నారు. కనీస విద్య, వైద్య సదుపాయలు లేవు. ఎస్​ కోట నియోజకవర్గంలో కనీస వసతులు లేవు. ఉత్తరాంధ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి కచ్చితంగా బీజేపీతోనే సాధ్యం." -జీవీఎల్ నరసింహరావు, రాజ్యసభ సభ్యులు

సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క ఎన్నికల్లోనూ ప్రజల మద్దతుతో గెలవలేదని.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అక్రమంగా గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నెల్లూరు జిల్లా తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఎన్నికల్లో విజయం కోసం వైఎస్సార్​సీపీ దొంగ ఓట్లను నమ్ముకుందని, ఇందుకు తిరుపతిలో వెలుగు చూసిన దొంగ ఓట్లే నిదర్శనమని పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో తూర్పు రాయలసీమ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ను గెలిపించాలని కోరుతూ.. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రచారం నిర్వహించారు..

"చదువుకున్న వాళ్లు పట్టభద్రలు వాళ్లకు ఓటు వేయరని వారికి భయమేస్తోంది. చదువు రానివాళ్లే మీకు ఓట్లు వేసేందుకు సిద్ధంగా లేరు. అలాంటిది చదువుకున్న వాళ్లు ఎలా వేస్తారు. శ్యాం సుందర్​ ఎవరు.. కల్తీ మద్యంలో ఏ3. గడిచిన నాలుగు సంవత్సరాలో మీరెంటో నిరూపితమయ్యింది. ఇటువంటి ముఖ్యమంత్రిని, పాలనను గతంలో ఎన్నడు చూడలేదు." -సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.