ETV Bharat / state

Perni Nani comments 99 శాతం హామీలు అమలు.. ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకే జీపీఎస్: మాజీ మంత్రి పేర్ని - perni is Nani on cps govet

Perni Nani Key Comments on GPS: సీపీఎస్ ను రద్దు చేస్తానని మచిలీపట్నంలో పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చి దాన్ని అమలు చేశారని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మేనిఫెస్టో లో ఇచ్చిన 99 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారని పేర్ని నాని వెల్లడించారు. లోకేశ్‌ భద్రపై మీడియా అడిగి ప్రశ్నకు పేర్ని నాని వ్యంగంగా స్పందించారు. లోకేశ్‌ స్థాయికి మించి ప్రభుత్వం భద్రత కల్పిస్తోందని నాని వెల్లడించారు.

Perni Nani
Perni Nani
author img

By

Published : Jun 9, 2023, 10:18 PM IST

Perni Nani comments on Lokesh: ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీపీఎస్ ను రద్దు చేసి జీపీఎస్​ను తీసుకు వచ్చారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సీపీఎస్ విధానంలో ఉద్యోగికి 400 రూపాయలు పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేదని ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడేవారన్నారు. సీపీఎస్ ను రద్దు చేస్తానని మచిలీపట్నంలో పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చి దాన్ని అమలు చేశారన్నారు.

ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన 99 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారని పేర్ని నాని వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పినట్లు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులర్ చేస్తున్నారన్నారు. రాజకీయం కోసం తెలంగాణ లో ఎవరో సీఎం చేశారని ఇక్కడ చేయడం లేదన్నారు. పే కమిషన్ వేసేందుకు గతంలో ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఉండేదని, ఏ ఉద్యోగీ రోడ్డెక్కకుండానే 12వ పీఆర్సీ కమిటీని సీఎం జగన్ ప్రకటించారన్నారు. వైద్య విధాన పరిషత్ లో పనిచేసే ఉద్యోగులు గతంలో చాలా కష్టాలు పడేవారని, పెన్షన్ రావాలంటే నే నరకం చూసేవారని, రాష్ట్రంలో 13వేల మంది వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపుతూ నిర్ణయం తీసుకోవవడం అభినందనీయమన్నారు. ఉద్యోగుల పట్ల ఇంతగా సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం గతం లో ఏదీ లేదన్నారు.

CPS Cancellation జీపీఎస్​పై ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించలేము : ఏపీటీఎఫ్

లోకేశ్‌ భద్రపై మీడియా అడిగి ప్రశ్నకు పేర్ని నాని వ్యంగంగా స్పందించారు. లోకేశ్ చంద్రబాబు కొడుకు అయినందుకు భద్రత కల్పించాలా అని అన్నారు. లోకేశ్ స్థాయికి మించి ప్రభుత్వం భద్రత కల్పిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. లోకేశ్‌పై సొంత పార్టీ కార్యకర్తలే కోడిగుడ్లు వేశారన్న నాని పార్టీ శ్రేణులకు క్రమశిక్షణ నేర్పుకోవాలని హితవు పలికారు. పాదయాత్రలో భద్ర కల్పిస్తున్న పోలీసులను లోకేశ్ దూషిస్తున్నారని పేర్ని నాని అన్నారు. తనకు లోకేశ్ సెల్ఫి ఇవ్వకపోవడంతో టీడీపీ కార్యకర్తే కోడిగుడ్లు వేశారని పేర్ని నాని వెల్లడించారు. పాదయాత్రలో లోకేశ్ పోలీసులను తిడుతున్నా... పోలీసులు మాత్రం లోకేశ్ పాదయాత్రలో క్రమశిక్షణతో వ్యవహారిస్తున్నారని వెల్లడించారు. ముందు టీడీపీ కార్యకర్తలకు క్రమశిక్షణ నేర్పించాలని పేర్ని నాని అన్నారు.

MLA Perni Nani on Retirement: 'హా..అందుకే రిటైర్​ అవుతున్నా​..!' పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

'సీపీఎస్ విధానంలో ఉద్యోగికి 400 రూపాయలు పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది. సీపీఎస్ ను రద్దు చేస్తానని మచిలీపట్నంలో పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేశారన్నారు. ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన 99 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పినట్లు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులర్ చేశారు. రాజకీయం కోసం తెలంగాణ లో ఎవరో సీఎం చేశారని ఇక్కడ చేయడం లేదు. పే కమిషన్ వేసేందుకు గతంలో ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఉండేది. ఏ ఉద్యోగీ రోడ్డెక్కకుండానే 12వ పీఆర్సీ కమిటీని సీఎం జగన్ ప్రకటించారు. వైద్య విధాన పరిషత్ లో పనిచేసే ఉద్యోగులు గతంలో చాలా కష్టాలు పడేవారు. రాష్ట్రంలో 13వేల మంది వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపుతూ నిర్ణయం తీసుకోవవడం అభినందనీయం.'- పేర్ని నాని,మాజీ మంత్రి

ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకే జీపీఎస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.