Outsourcing Employees State Level Meeting in Vijayawada: అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. విజయవాడ జింఖానా మైదానంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రథమ మహాసభను నిర్వహించారు. ఈ సభకు బొప్పరాజుతోపాటు సెక్రటరీ జనరల్ దామోదరరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్టు తదితరులు హాజరయ్యారు.
మినిమం టైం స్కేల్ అమలు చేయాలి: రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఓ కాలపరిమితి విధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని కోరారు. ఆప్కాస్ లో చేరకుండా మిగిలిన లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వం ఆప్కాస్ లో చేర్పించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. స్కిల్, సెమీ స్కిల్ అనే బేధం లేకుండా అందరినీ సమానంగా చూడాలన్నారు. మెప్మా, సెర్ప్ లో పని చేస్తున్న వారికి గతంలో ఇచ్చిన మాదిరిగానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మెడికల్ లీవులు ఇవ్వాలని పేర్కొన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబానికి ఉద్యోగం కల్పించాల్సిన అవసరం ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును 62 ఏళ్లకు పెంచాలని ఆయన కోరారు.
బీసీ సంక్షేమ శాఖ వద్ద ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన
'పొరుగు సేవల సిబ్బందికి మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలి. ఆర్టీసీ, ఇరిగేషన్, గురుకులాల్లో చేసేవారికి ‘ఆప్కాస్’లోకి తీసుకోవాలి. వాళ్లకు హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలి. మెడికల్ సెలవులు ఇవ్వాలి. పొరుగు సేవల సిబ్బందికి సంక్షేమ పథకాలు ఆపేశారు. వాళ్ల సమస్యల పరిష్కారానికి ఏపీజేఏసీ పోరాడుతుంది' బొప్పరాజు వెంకటేశ్వర్లు
పొరుగు సేవల ఉద్యోగులపై వేటు మొదలుపెట్టిన ప్రభుత్వం..
ఏపీజేఏసీ నేత దామోదర్ రావు: ఆర్థికశాఖ అనుమతి లేకుండా ఏవ్వరూ ఉద్యోగులు ఉండరని తెలిపారు. సర్వీస్ నిబంధనలు పెట్టి మినిమం టైం, స్కేల్ అమలు చేయాలని ఏపీజేఏసీ నేత దామోదర్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆప్కాస్ ద్వారా మార్పు తెచ్చే ప్రయత్నాలు చేసినా, ఇంకా కొన్ని చోట్లలో అవుట్ సోర్స్ ఉద్యోగులను మోసం చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్ అంతా అవుట్సోర్స్ ఉద్యోలతో నింపుతారని తెలిపారు. అవుట్సోర్స్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే జీతాలతో ఇంటి అద్దె, రోజావారి ఖర్చులు సరిపోవడం లేదని తెలిపారు. ఎవ్వరికైన రోజువారి ఖర్చులు ఒక్కటే అయినప్పుడు రెగ్యూలర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వారికి సమానవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ గతంలో పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను అములు చేయాలని మాత్రమే, తాము అడుగుతున్నామని పేర్కొన్నారు. పొరుగు సేవల సిబ్బంది సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని తెలిపారు. ఈప్కాస్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని దామోదర్ రావు పేర్కొన్నారు.
ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కార్యాచరణ ప్రారంభం