ETV Bharat / state

తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోంది : నందమూరి రామకృష్ణ - నందమూరి తారకరత్న

taraka ratna
taraka ratna
author img

By

Published : Jan 30, 2023, 3:26 PM IST

Updated : Jan 30, 2023, 5:15 PM IST

15:21 January 30

శరీర అవయవాలన్నీ బాగా పని చేస్తున్నాయి

నందమూరి రామకృష్ణ

Nandamuri Ramakrishana: తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని నందమూరి రామకృష్ణ తెలిపారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై రామకృష్ణ మాట్లాడారు. దురదృష్టవశాత్తు ఇలా జరిగిందని ఆయన అన్నారు. తారకరత్న శరీర అవయవాలన్నీ బాగా పని చేస్తున్నాయని.. ఈ రోజు మధ్యాహ్నం వైద్యులు సిటీ స్కాన్ చేశారన్నారు.

గుండె, లివర్ ఇతర అవయవాలన్నీ నార్మల్ స్థితికి వచ్చాయి. పార్షియల్ వెంటిలేషన్ మీద వైద్యులు చికిత్స అందిస్తున్నారు. న్యూరో రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. నైపుణ్యత కలిగిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు.. వైద్యుల ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. త్వరలోనే తారకరత్న కోలుకుని మన ముందుకు వస్తారు. తారకరత్న ఆరోగ్యం బాగుండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా. -నందమూరి రామకృష్ణ

లోకేశ్​ పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురైన హీరో నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని.. మరిన్ని పరీక్షలు చేసిన తర్వాత స్పష్టత వస్తుందని ఈ రోజు ఉదయం వైద్యులు తెలిపారు. ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ చేసిన అనంతరం తారకరత్న ఆరోగ్యంపై పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశముందని వివరించారు.

అభిమానుల రాక: నారాయణ హృదయాలయ ఆస్పత్రి వద్ద అభిమానులు, సందర్శకుల తాకిడి పెరుగుతుండటంతో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసు అధికారులను బెంగళూరు సిటీ పోలీస్‌ కమిషనర్ ప్రతాప్‌రెడ్డి ఆదేశించారు.

తారకరత్నకు కుప్పంలో యాంజియోప్లాస్టీ తర్వాత నారాయణ హృదయాలయలో వైద్యుల బృందం ఆయనకు చికిత్స కొనసాగిస్తోంది. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్‌ ఆదివారం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఆయన గుండె స్పందన సాధారణంగా ఉన్నా మెదడు పనితీరు సాధారణ స్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాలపాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై ప్రభావం పడినట్లు పరీక్షల ద్వారా గుర్తించామని తెలిపారు. నిమ్హాన్స్‌ న్యూరోసర్జన్‌ ప్రొఫెసర్‌ గిరీష్‌ కులకర్ణి నేతృత్వంలో ఇద్దరు న్యూరో సర్జన్లు తారకరత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం నారాయణ హృదయాలయ, నిమ్హాన్స్‌ల నుంచి 10 మంది వైద్యులు ఆయన పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

అసలేం ఏం జరిగిందంటే?: చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు, కుటుంబసభ్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Jan 30, 2023, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.