Womens questioned MLA Rakshana Nidhi: ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కోడూరులో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధిని మహిళలు నిలదీశారు. అడుగడుగునా మహిళలు ఎమ్మెల్యేకు సమస్యలపై ప్రశ్నించారు. అడ్డమైన పథకాలు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మంచి పనైనా చేశారా అని నిలదీశారు. పక్కా ఇళ్లు మంజూరు చేయలేదని, రహదారులు అధ్వానంగా ఉన్నాయని, జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి ఉందని.. పలు సమస్యలను ఎమ్మెల్యే వద్ద ఏకరవు పెట్టారు.
ఇదీ చదవండి: 'ఆ విషయంలో తెదేపా.. లేనిపోని ఆరోపణలు చేస్తోంది'