ETV Bharat / state

Review on Free Electricity: 'ఉచిత విద్యుత్ దరఖాస్తులకు తుది గడువు లేదు' - latest news on peddireddy

Peddireddy Review Meeting: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంధన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాడు. ఉచిత విద్యుత్ కోసం వచ్చే దరఖాస్తులకు ఎటువంటి తుది గడువు ఉండకూడదని పెద్దిరెడ్డి  వెల్లడించారు. వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి విద్యుత్ కనెక్షన్ లను మంజూరు చేయాలని డిస్కంలకు మంత్రి సూచించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ అధికమవుతున్నా ప్రజలకు కోతలు లేకుండా విద్యుత్​ను అందిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇదే తరహాలో విద్యుత్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Minister Peddireddy Ramachandra Reddy
author img

By

Published : May 15, 2023, 10:09 PM IST

Minister Peddireddy Ramachandra Reddy: దరఖాస్తు చేసిన ప్రతీ రైతుకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్​ అందించాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి ఇంధన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉచిత విద్యుత్ కోసం వచ్చే దరఖాస్తులకు ఎటువంటి తుది గడువు ఉండకూడదని పెద్దిరెడ్డి వెల్లడించారు. వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయాలని డిస్కిం లకు మంత్రి సూచించారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులకు జూన్ 15వ తేదీలోగా పరిష్కరించి, కనెక్షన్లు మంజూరు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. మార్చి నెలాఖరు వరకు సుమారు 1.20 లక్షల విద్యుత్ కనెక్షన్లను వ్యవసాయానికి అందించినట్లు మంత్రి పేర్కొన్నారు.

బకాయిల వసూలుకు ప్రత్యేక డ్రైవ్: మరోవైపు జగనన్న హౌసింగ్ కాలనీలకు విద్యుద్దీకరణను నిర్ణేశిత లక్ష్యంలోగా పూర్తి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి కోరారు. సీపీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి పారిశ్రామిక సంస్థల నుంచి వచ్చేటటువంటి బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్​ను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే టెండర్లు, అవార్డుల స్థాయిలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ అధికమవుతున్నా ప్రజలకు కోతలు లేకుండా విద్యుత్ ను అందిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో విద్యుత్ సరఫరాను కొనసాగిస్తామని మంత్రి వెల్లడించారు.

ప్రజాప్రతినిధులు, రైతులతో సబ్ స్టేషన్ స్థాయి కమిటీలు: 33కెవి సబ్ స్టేషన్ల పరిధిలో జవాబుదారీతనం పెంచేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో సబ్ స్టేషన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కమిటీలు తమ పరిధిలో విద్యుత్ డిమాండ్, లో ఓల్టేజీ, విద్యుత్ సరఫరా తదితర అన్ని అంశాలను పరిశీలిస్తాయని మంత్రి వెల్లడించారు. మెరుగైన విద్యుత్ సరఫరా వ్యవస్థకు ఈ కమిటీలు సహకరిస్తాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 24గంటలపాటు కరెంట్ ఇచ్చే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందున్నట్లు మంత్రి వెల్లడించాడు.

'రైతులకు ఇచ్చే వ్యవసాయ కనెక్షన్స్​తో పాటుగా వివిధ అంశాలపై విద్యుత్ శాఖకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించాం. ట్రాన్స్​కోతో ఉన్న కోఆర్డినేషన్ సమస్యలు, పోల్ టూ పోల్ సమస్యలపై చర్చించాం. రైతులకోసం ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ రైతుల పక్షపాతిగా పని చేస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి దాదాపు 1.20 లక్షల విద్యుత్ కనెక్షన్లను వ్యవసాయానికి అందించాం. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులకు జూన్ 15వ తేదీలోగా పరిష్కరించే విధంగా కృషి చేస్తాం.'- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.