ETV Bharat / state

నున్న మార్కెట్లో ప్రారంభమైన మామిడి ఎగుమతులు.. - మామిడి ధర న్యూస్

MANGO FARMERS: ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటైన నున్న మామిడి మార్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలకు మామిడి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం మామిడి పంటకు సరైన మద్దతు ధర లేదని, ఈ ఏడాదైన మామిడి తమ జీవితాల్లో తీపిని నింపుతుందేమోనని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. నున్న మార్కెట్​లో మామిడి ఎగుమతిపై ప్రత్యేక కథనం మీకోసం..

mango exports begin at nunna market
నున్న మార్కెట్లో ప్రారంభమైన మామిడి ఎగుమతులు
author img

By

Published : Mar 20, 2023, 8:31 AM IST

Updated : Mar 20, 2023, 9:28 AM IST

MANGO FARMERS: ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటైన నున్న మామిడి మార్కెట్ నుంచి ఈ సంవత్సరం మామిడి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఏటా మార్కెట్ లో దాదాపు 40 దుకాణాల ద్వారా మామిడికాయల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. దుకాణాలు ప్రారంభం కావడంతో మామిడి ఎగుమతులను ప్రారంభించినట్లు మామిడి మార్కెట్ సంఘ ప్రతినిధులు తెలిపారు. మొదటి రోజునే బంగినపల్లి మామిడిని 50 టన్నుల వరకు మహరాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలకు ఎగుమతి చేశారు. నున్న మామిడి మార్కెట్ నుంచి ప్రతి సంవత్సరం దిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక తదితర రాష్ట్రాల్లోని వివిధ నగరాలకు మామిడికాయలను ఇక్కడి వ్యాపారులు ఎగుమతి చేస్తారు.

సంవత్సరం ప్రారంభం కావడంతో రైతులు తమ మామిడి పంటను మార్కెట్​కు తీసుకుని వెళ్తున్నారు. ఈ మామిడిని సాగు చేసేందుకు చాలా ఇబ్బందులు పడ్డామని రైతులు చెబుతున్నారు. వాతావరణం సరిలేకపోవడంతో దిగుబడి బాగా తగ్గిందని చెప్పారు. ఎకరం మామిడి తోటకు విత్తనం వేసిన దగ్గర నుంచి కాయ మార్కెట్​కు వచ్చే వరకు సుమారు 50 వేలు ఖర్చు అవుతుందని రైతులు పేర్కొన్నారు. ప్రస్తుతం టన్ను మామిడి ధర 20 వేలుగా ఉందని, కాయల నాణ్యతను బట్టి మామిడికి రేటు నిర్ణయిస్తున్నారని అన్నారు. ఎరువులు, పురుగు మందులు ఇతర రసాయినాల ధరలు పెరిగిపోయాయనని రైతులు తెలిపారు. అకాల వర్షాలు కూడా పంటను బాగా దెబ్బతిశాయని వాపోతున్నారు.

జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ మూడు నెలల్లో మూడు సార్లు మామిడి పూత వచ్చిందని రైతులు తెలిపారు. జనవరి, మార్చిలో వచ్చిన మామిడి పూత పర్వాలేదు కానీ ఫిబ్రవరిలో వచ్చిన పూత మాత్రం రాలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం సరిలేకపోవడంతో మామిడి దిగుమతి బాగా తగ్గిందని వివరించారు. గత ఏడాది మామిడి ధరలు పర్వాలేదనిపించినా మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని రైతులు అంటున్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని మామిడి పంటను సాగు చేశామని రైతులు తెలిపారు. తాము లాభాలు ఆశించడం లేదని తాము పెట్టిన పట్టుబడి వస్తే చాలని పెర్కొన్నారు. కూలీల కొరత తీవ్రంగా వేధిస్తుందని, అందువల్ల కూలీలు అడిగిన రేటుకే వారికి కూలీ చెల్లించాల్సి వస్తుందని రైతులు తెలిపారు. అప్పులు చేసి, ఎన్నో వ్యయప్రయాసలను తట్టుకుని సాగు చేశామన్నారు.

నున్న మామిడి మార్కెట్ నుంచి ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తుంటారు. స్థానికంగా ఉన్న వ్యాపారులు కూడా ఇక్కడి నుంచే కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసే వినియోగదారులపై భారం, పంట పండించిన రైతుకు మద్దతు ధర రావడం లేదు. మధ్యలో ఉన్న దళారీలు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మామిడి సీజన్ ప్రారంభంలో కాయలును తీసుకువస్తున్నామని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మద్దుతు ధర ఉంటుందనే ఆశిస్తున్నామని రైతులు అంటున్నారు. వ్యాపారులు తమ కాయలకు మద్దతు ధర ఇచ్చి తాము సంతోషంగా ఇళ్లకు వెళ్లేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

" నున్న మార్కెట్​కు ఈ రోజు దాదాపు 3 టన్నుల మామిడి కాయలను మేము తీసుకుని వచ్చాము. మందులు కొట్టేందుకు, పిచికారి చేసేందుకు మాకు చాలా ఖర్చులు అయ్యాయి. దీంతోపాటు మాకు వాతావరణం కూడా అనుకూలించలేదు. ఇన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని మేము మామిడిని మార్కెట్​కు తీసుకుని వచ్చాము. మా మామిడి కాయలకు మంచి రేటు పలికి మేము పెట్టిన పెట్టుబడి అయినా వస్తే చాలు." - ఏడుకొండలు, మామిడి రైతు

ఈ మార్కెట్ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు మామిడి కాయలను ఎగుమతి చేయడం జరుగుతుందని నున్న మామిడి మార్కెట్ సంఘ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాయలు పక్వానికి రావడానికి ఎటువంటి రసాయనాలు వినియోగించడం లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే సమయంలో ఆహార భద్రతా శాఖ అధికారులు సూచించిన మేరకు ఆ ప్యాకింగ్​లో ఇథనాల్ ప్యాకెట్స్​ను వేస్తామని వివరించారు. తమ మార్కెట్లో ముసుగు వ్యాపారం జరగడం లేదన్నారు. రైతులు మార్కెట్​కు తీసుకువచ్చిన కాయలను వారి అనుమతితో మాత్రమే కొనుగోలు చేస్తున్నామన్నారు. మార్కెట్​కు వచ్చే రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

"మామిడి కాయలు పక్వానికి రావటానికి ఎటువంటి రసాయనాలను వినియోగించటం లేదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించిన మేరకు ఆ ప్యాకింగ్​లో ఇథనాల్ ప్యాకెట్స్​ను వాడుతున్నాము. మార్కెట్​కు మామిడి కాయలను తీసుకుని వచ్చిన రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేశాము. - శ్రీనివాసరెడ్డి, నున్న మామిడి మార్కెట్ సంఘ కార్యదర్శి

మామిడి పళ్లను ఇష్టపడని వారు ఎవరు ఉండరు.. కానీ మామిడిని సాగు చేసిన రైతులకు మాత్రం మద్దతు ధర లేకపోడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి మామిడి రైతులకు మద్దతు ధర కల్పించాలని వ్యవసాయ సంఘాల నేతలు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 20, 2023, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.