Lumpy skin virus in Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఆవులు, ఎద్దులకు లంపీ స్కిన్ వైరస్ విస్తృతంగా ప్రబలుతోందని పాడి రైతులు దిగులు చెందుతున్నారు. చాలా గ్రామాలలో ఇప్పటికే ఈ వ్యాధి చాప కింద నీరులా పాకుతుందని వాపోయారు. ఈ వ్యాధి సంక్రమించడం ద్వారా పశువుల చర్మంపై బొబ్బలు, కణతులు ఏర్పడుతున్నాయని.. తక్షణమే వ్యాధిపై పశుసంవర్ధక శాఖ అధికారులు దృష్టి కేంద్రీకరించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రామాలలో బృందాలుగా ఏర్పడి స్కిన్ వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని, వ్యాధి సంక్రమించకుండా ముందస్తుగా వ్యాక్సిన్లను అందచేసేలా కార్యాచరణ చేపట్టాలని కోరుతున్నారు. ఇటీవల పున్నవెల్లి గ్రామంలో ఓ ఎద్దు మృతి చెందిందని.. దానినుంచి మరొక దానికి వ్యాధి వ్యాపిస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చదవండి: