ETV Bharat / state

Low Water Storage in Reservoirs: జలాశయాల్లో నీటి కొరత.. సెప్టెంబరులోనైనా వరుణుడు కరుణించాలని రైతుల ఆశలు - AP Latest News

Low Water Storage in Nagarjunasagar and Srisailam Projects: వరుణుడు కరుణించకపోవడంతో రాష్ట్రంలోని జలాశయాలన్నీ వెలవెలబోతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి నిండుకుండలా ఉన్న జలాశయాల్లో.. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక నీటి నిల్వలు సగం కూడా లేని పరిస్థితి. దీంతో సెప్టెంబరులో వరుణుడు కరుణించాలని రైతులు కోరుకుంటున్నారు.

low_water_storage_in_reservoirs
low_water_storage_in_reservoirs
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2023, 7:40 AM IST

Updated : Aug 31, 2023, 11:47 AM IST

low_water_storage_in_reservoirs: జలాశయాల్లో నీటి కొరత

Low Water Storage in Nagarjunasagar and Srisailam Projects: రాష్ట్రంలో ఈ సంవత్సరం సరైన వర్షాల్లేక జలాశయాల్లో వెలవెలబోతున్నాయి. ప్రధాన జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ల్లో కిందటి ఏడాది 515 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం 242 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి. అందులోనూ వినియోగించుకోదగ్గ నీళ్లు 56 టీఎంసీలు మాత్రమే మిగిలాయి. సెప్టెంబరులో వర్షాలు అనుకున్న రీతిలో లేకపోతే ఆయకట్టు బీడు పడటమే కాకుండా.. గొంతు తడుపుకోవడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Rayalaseema Farmers Waiting For HNSS Water: హంద్రీనీవాకు పారని సాగునీరు.. రైతు కంట పారుతున్న కన్నీరు

Krishna and Godavari regions have not received rain this year: రాష్ట్రంలో వర్షాలు కురవకపోయినా కృష్ణా పరీవాహకంలో ఎగువన భారీ వర్షాలు పడి ఉంటే జలాశయాలు నిండిపోయేవి. కృష్ణా, గోదావరి ప్రాంతంలో ఈ సంవత్సరం అనుకున్న విధంగా వర్షాలు లేవు. కృష్ణా నదిపై మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్నటువంటి ఎగువ జలాశయాల్లో నీటి నిల్వలు లేవు. దీంతో అవి ఎప్పుడు నిండాలి, దిగువకు ఎప్పుడు నీళ్లు రావాలి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలోని జలాశయాలు ఎప్పుడు నిండాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం ఆఖరి నెలలో అడుగుపెడుతున్నాం. ఆ తర్వాత ఈశాన్య రుతుపవన కాలం ప్రారంభమైనా.. రాష్ట్రంలోని కొద్ది జిల్లాలకు మాత్రమే ఆ కాలంలో వర్షాలు కురుస్తాయి. దీంతో సెప్టెంబరులో వరుణుడు కరుణించాలని రైతులు కోరుకుంటున్నారు.

Chandrababu Power Point Presentation: నదుల అనుసంధానానికి దేశంలోనే తొలిసారి పునాది వేసింది టీడీపీ: చంద్రబాబు

Current water storage in Srisailam and Nagarjunasagar projects: ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో కలిపి 242 టీఎంసీలు నీళ్లు మాత్రమే ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే సమయానికి ఆ రెండు జలాశయాల్లో కలిపి మొత్తం 515 టీఎంసీలకు పైగా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు సగం కూడా లేవు. డెడ్‌ స్టోరేజి మినహాయిస్తే నాగార్జునసాగర్‌లో 21.834 టీఎంసీలు, శ్రీశైలంలో 34.827 టీఎంసీలు మాత్రమే వినియోగానికి అందుబాటులో ఉన్నాయి. శ్రీశైలానికి నీళ్లు రావాలంటే ఇంకా ఎగువన అనేక ప్రాజెక్టులు నిండాలి.. కాని ఆలమట్టి ఇప్పటికీ నిండలేదు. ఇంకా మరో 3 టీఎంసీలు వస్తేనే ఆ ప్రాజెక్టు నిండుతుంది.

ఈ ప్రాజెక్టులోకి చాలా కాలంగా ఇన్‌ఫ్లో లేదు. కొద్దిపాటిగా ఉన్నా అక్కడి వినియోగానికే సరిపెడుతున్నారు. నారాయణపూర్‌ జలాశయంలోకి ఇంకో 10 టీఎంసీలు నీరు వస్తేనే నిండే పరిస్థితి. జూరాలలోకి మరో 3 టీఎంసీలకు పైగా రావాల్సి ఉంటుంది. ఇప్పటికీ తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండలేదు. మరో 27 టీఎంసీలు వస్తేనే నిండుతుంది. సాధారణంగా శ్రీశైలం జలాశయానికి తుంగభద్ర నుంచి భారీగా నీటి ప్రవాహాం వచ్చి ఇక్కడి లోటును తీర్చే సంవత్సరాలే అధికం. అలాంటిది ఈ ఏడాది తుంగభద్ర పరీవాహకమూ కరుణించకపోవడం గమనార్హం.

Chandrababu fire on Jagan: 'నాలుగేళ్లలో 4 శాతమే ప్రాజెక్టుల పనులు.. సిగ్గనిపించడం లేదా జగన్'

There are many medium and small reservoirs in state: రాష్ట్రంలోని 21 జిల్లాల్లో అనేక మధ్య తరహా, చిన్న జలాశయాలు ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను మినహాయించి మిగిలిన జలాశయాలను కలిపి పరిశీలిస్తే పోయిన సంవత్సరం ఇదే సమయానికి 300 వాటిలో టీఎంసీలకు పైగా నీళ్లు ఉన్నాయి. ప్రస్తుతం కేవలం 165 టీఎంసీలే ఉన్నాయి. గోదావరి పరీవాహకంలో కూడా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ఆగస్టులో ఎప్పుడూ గోదావరికి భారీ వరదలు వచ్చేవి. అలాంటిది ఈ ఏడాది గోదావరికి ప్రవాహం తక్కువుగానే ఉంది.

భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 70 లక్షలు, చిన్ననీటి పారుదల కింద 25 లక్షలు, నీటి అభివృద్ధి సంస్థ పరిధిలో దాదాపు 8 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీళ్లు అందించే అవకాశం ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అనేక భారీ సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టు సాగు ప్రశ్నార్థకమైంది. శ్రీశైలం ప్రాజెక్టు ఆసరా చేసుకుని సాగు చేసే ఆయకట్టులో ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే వరి సాగు చేసిన కర్షకుల పరిస్థితి ఏమిటో అర్థంకావట్లేదు. భవిష్యత్తులో నీళ్లు అందించడం ఎలా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Last Updated : Aug 31, 2023, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.