liquor sales to touch record highs in Andhra Pradesh: సీఎం జగన్ తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో రాగానే దశలవారీగా మద్య నిషేధం చేస్తానంటూ హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు మద్యం అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్నారు. మద్యంపై ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తామని చెప్పిన జగన్, అర్ధరాత్రి ఒంటి గంట వరకూ విక్రయాలకు అనుమతులు ఇచ్చి మరీ మద్యంప్రియుల దగ్గర పిండుకుంటున్నారు. కొత్త సంవత్సర వేడుకలకు నేపథ్యంలో రూ. 147 కోట్ల విక్రయాలు జరిగాయి. ఇవి సాధారణం కంటే రెట్టింపు విక్రయాలు అనే చెప్పవచ్చు. అయితే, దశలవారీగా మద్య నిషేధం, ఆదాయాన్ని తగ్గించుకుంటూ వెళ్లడం ఇలాగేనా అనే సందేహాలు ప్రజల్లో కలుగుతుంది.
మద్యపాన ప్రియులా.. అయితే చదవండి
147 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక దశలవారీగా మద్య నిషేధం చేస్తానంటూ సీఎం జగన్ గతంలో హామీ ఇచ్చి, మద్యం అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తూ ఇతర రాష్ట్రాలతో పోటి పడుతున్నారు. మెుదట్లో మద్యంపై ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తామని చెప్పిన ఈ పెద్దమనిషి, అర్ధరాత్రి ఒంటి గంట వరకూ విక్రయాలకు అనుమతి ఇచ్చి మరింత పిండుకుంటున్నారు. మద్యపానాన్ని నిరుత్సాహపరుస్తామంటూ పదే పదే ప్రకటించిన జగన్ మరింత తాగించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త సంవత్సర స్వాగత వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాల్లో వైస్సార్సీపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం డిసెంబరు 31న ఒక్క రోజులోనే రూ. 147 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు జరిపింది. 2022 డిసెంబరు 31న మొత్తం రూ.142 కోట్ల విలువైన మద్యం అమ్మగా, 2023 సంవత్సరం డిసెంబరు 31న అప్పటికంటే రూ.5 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు చేపట్టింది. మాములుగా అయితే, రాష్ట్రంలో సాధారణంగా రోజుకు రూ.70 నుంచి 75 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతాయి.
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రూ. 137 కోట్లు: ప్రభుత్వ ద్వారా నిర్వహించే మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బుల్లో నిర్దేశిత సమయం కన్నా మూడు గంటలు ఎక్కవగా విక్రయాలకు అనుమతి ఇచ్చింది. అందువల్ల మొత్తంగా 14 గంటల పాటు మద్యం అమ్మాకాలు జరిగాయి. అంటే, గంటకు సగటున రూ. 10.50 కోట్ల విలువైన లిక్కర్‌ను విక్రయించారు. మొత్తంగా 1.51 లక్షల కేసుల ఐఎంఎల్, 67 వేల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రూ. 137 కోట్లు, బార్లు, క్లబ్బుల్లో రూ.10 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. దశలవారీ మద్యనిషేధమంటే మద్యం అందుబాటులో లేకుండా చేయాలి. దానిపై వచ్చే ఆదాయాన్ని తగ్గించటమంటే విక్రయాల సమయాన్ని కుదించాలి. మద్యపానాన్ని నిరుత్సాహపరచాలి. కానీ వాటిని ప్రోత్సహిస్తూ, ఆదాయాన్ని పిండుకోవటాన్ని మద్యపాన నిషేదం అంటారా అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
గత నాలుగు సంత్సరాలుగా డిసెంబర్ 31న జరిగిన మద్యం విక్రయాల వివరాలు
2020 డిసెంబరు 31న రూ.118 కోట్లు
2021 డిసెంబరు 31న రూ.124 కోట్లు
2022 డిసెంబరు 31న రూ.142 కోట్లు
2023 డిసెంబరు 31న రూ.147 కోట్లు