ETV Bharat / state

CID Notices: భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సీఐడీ సంకెళ్లు..!

Lawyers Counter: మార్గదర్శి ఆడిటర్ అరెస్ట్​పై రౌండ్ సమావేశంలో అభిప్రాయాలను వ్యక్తం చేసిన న్యాయవాదులకు సీఐడీ నోటిసులివ్వటంపై న్యాయవాదులు స్పందించారు. అభిప్రాయం వ్యక్తం చేస్తే .. మీదగ్గరున్న ఆధారాలు తీసుకురావాలని నోటీసులివ్వటం సరికాదన్నారు. 65 ఏళ్లు పైబడిన వారికి 160 సీఆర్పీసీ నోటీసులివ్వకూడదని నిబంధనను కూడా సీఐడీ పోలీసులు ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు.

Lawyers Counter
మార్గదర్శి ఆడిటర్ అరెస్ట్ పై
author img

By

Published : Apr 16, 2023, 10:55 PM IST

Updated : Apr 17, 2023, 6:31 AM IST

న్యాయవాదులకు సీఐడి నోటిసులివ్వటంపై న్యాయవాదుల స్పందన

Counter On CID Notices: మార్గదర్శి ఆడిటర్ అరెస్ట్​పై రౌండ్ సమావేశంలో అభిప్రాయాలను వ్యక్తం చేసిన న్యాయవాదులకు సీఐడీ నోటిసులివ్వటం.. వారి పరిధి దాటినట్లేనని న్యాయవాదులు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుందని నిపుణులు తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వారికి 160 సీఆర్పీసీ నోటీసులివ్వకూడదని నిబంధనను కూడా సీఐడి పోలీసులు ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు. అభిప్రాయం వ్యక్తం చేస్తే ..మీదగ్గరున్న ఆధారాలు తీసుకురావాలని నోటీసులివ్వటం సరికాదన్నారు. రాజ్యాంగ హక్కులను సీఐడీ అధికారులు ఉల్లంఘించరాని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. నోటీసులివ్వటం వెనుక ఉన్న కోణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వానికి అనుకులంగా సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు అనిపిస్తోందని న్యాయవాదులు అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి సెక్షన్​ 160 కింద నోటీసులు ఇస్తున్నారని పేర్కొన్నారు. సీఐడీ భావప్రకటన స్వేచ్ఛను హరించేందుకే ఇలాంటి చర్యలు చేపడుతుందని న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు సీఐడీ అధికారులు నోటీసులు ఇస్తునారంటూ మండిపడ్డారు. సీఐడీ అధికారుల చట్టాలను దృష్టిలో పెట్టుకోని పనిచేస్తున్నట్లు కనిపించడం లేదన్నారు. నోటీసుల పేరుతో చట్టాలను ఎలా దుర్వినియోగం చేస్తన్నారో అనే అంశంపై జాతీయ స్థాయిలో చర్చలు జరగాలని పలువురు న్యాయవాదులు అభిప్రాయ పడ్డారు. ప్రశ్నించే గొంతులను నొక్కెందుకే నోటీసులిచ్చారని పలువురు న్యాయవాదులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు . సీఐడీ నోటీసులకు నిరసనగా వివిధ కార్యక్రమాలు చేపడతామని చెబుతున్నారు.

'02-04-2023న ఆడిటర్ అరెస్ట్​లపై సీనియర్ లాయర్స్​ రౌండ్ టేబుల్​ సమావేశం నిర్వహించారు. వాళ్లకు ఉన్న భావ స్వేచ్ఛ వ్యక్తికరణను ప్రకటించారు. పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు. అలా మాట్లాడిన వారికి సెక్షన్ 160 పీఆర్సీ కింద నోటీసులు ఇచ్చారు. 15 సంవత్సరాల లోపు ఉన్నా వారు లేదా 60 సంవత్సరాలు నిండిన వారిని , మహిళల్ని విచారణకు పిలవకూడదని తెలిసినా... వారిని పిలిచారు. సీఐడీ గీత తన పరిధిని దాటి వ్యవహరిస్తోంది. ప్రభుత్వం మెప్పును పొందడానికే సీఐడీ పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.'- గూడపాటి లక్ష్మీనారాయణ , హైకోర్టు న్యాయవాది

'ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వం చేసే పనులపై ప్రశ్నించం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ప్రభుత్వానికి కొందరు అనుకూలంగా మాట్లాడుతారు. మరి కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతారు. మాట్లాడినంత మాత్రనా సెక్షన్ 160 కింద నోటీసులు ఇవ్వకూడదు. గత కొంతకాలంగా ప్రశ్నించేవారిపై కేసులు పెడుతూ వారిని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నారు. అందరికి చట్టం ఒక్కటే అన్న విషయం అధికారులు, ప్రభుత్వం గుర్తించాలి. అరెస్టులు, నోటీలు ఇవ్వడంపై గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా మెలగాలి.'- జగదీశ్వరరావు ,బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు

ఇవీ చదవండి

Last Updated : Apr 17, 2023, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.